గ్రామీతో కట్టలు తెగిన ఆమె ఆనందం!
58వ గ్రామీ సంగీత పురస్కారాల ప్రదానోత్సవంలో పాప్ సింగర్ టైలర్ స్విఫ్ట్ మళ్లీ తన సత్తా చాటింది. బెస్ట్ ఆల్బం కేటగిరిలో '1989' గీతానికి రెండోసారి గ్రామీ పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో టైలర్ స్విఫ్ట్ ఆనంద డొలికల్లో తేలిపోతూ.. తన సంతోషాన్ని ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. సంగీత ప్రపంచంలో అత్యున్నత పురస్కారంగా భావించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ఈసారి కాలిఫోర్నియా ర్యాపర్ కెండ్రిక్ లామర్ పంట పండింది.
ఆయన ఏకంగా ఐదు గ్రామీ పురస్కారాలతో తొలిస్థానంలో నిలిచాడు. మేఘన్ ట్రైనర్ బెస్ట్ న్యూ ఆర్టిస్ట్‌గా గ్రామీ గెలుచుకోగా, బెస్ట్ సాంగ్ కేటగిరీలో ఎడ్ షెరాన్ పురస్కారాన్ని గెలుచుకుంది. 'అప్‌టౌన్ ఫంక్' ఆల్బంకుగాను మార్క్ రాన్సన్ బెస్ట్ రికార్డు అవార్డు అందుకున్నారు. లేడీ గాగా, అడెల్ వంటి ప్రముఖ పాప్ సింగర్స్ హై వోల్టేజీ సంగీత ప్రదర్శనలతో ఈ అవార్డుల వేడుక ఆద్యంతం ఉర్రూతలూగింది.