
హఫీజ్ సయీద్ (ఫైల్ పిక్)
లాహోర్: దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ పాకిస్తాన్ ప్రభుత్వానికి సవాలు విసిరాడు. ‘ఒకవేళ పాకిస్తాన్ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే..రండి అరెస్ట్ చేయండి. కానీ 2018 సంవత్సరాన్ని కశ్మీరీలకు అంకితం చేయడాన్ని నేను ఆపను. మమ్మల్ని అణచడానికి మీరు ఎంతగా యత్నిస్తే అంతగా ఎదురు తిరుగుతాం’ అని సోమవారం నాడిక్కడ నిర్వహించిన ఓ ర్యాలీలో సయీద్ హెచ్చరించాడు. కశ్మీర్ అంశంలో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తగినంత కృషి చేయలేదని విమర్శించాడు. కశ్మీర్ స్వాతంత్య్రం కోసం పోరాడతానంటే షరీఫ్‌ను మళ్లీ ప్రధాని చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తామని ప్రకటించాడు. సయీద్ తలపై అమెరికా కోటి డాలర్ల నజరానాను ప్రకటించిన సంగతి తెలిసిందే