ఇవి అంతరించిపోయే ప్రమాదం!
వాషింగ్టన్: వాతావరణ మార్పుల కారణంగా అడవి తేనెటీగలు, సీతాకోకచిలుకల వంటి మొక్కల ఫలదీకరణకు దోహదపడే ప్రాణులెన్నో అంతరించిపోయే ప్రమాదం ఉందని ఐరాస వైజ్ఞానిక నివేదిక హెచ్చరించింది. 20 వేల ఫలదీకరణ జాతులు కోట్ల డాలర్ల విలువ చేసే పండ్లు, కూరగాయలు, కాఫీ తదితర పంటలకు కీలకమని పేర్కొంది. ఆహార పంటలు ప్రభావితం కాకముందే వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రపంచంపై ఉందని వెల్లడించింది.