ట్విటర్‌లోనూ టైమ్‌లైన్
శాన్‌ఫ్రాన్సిస్కో: ఫేస్‌బుక్‌లోని టైమ్‌లైన్ తరహాలో అల్‌గారిథమిక్ టైమ్‌లైన్‌ను ప్రారంభించేందుకు ట్విటర్ రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే వారంలోగా ఈ కొత్త టైమ్‌లైన్‌ను భారతదేశంతో పాటు మొత్తం 23 దేశాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ట్వీటర్ సంస్థ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ కొత్త టైమ్‌లైన్ ద్వారా సైన్‌ఇన్ చేయకపోయిన ముఖ్య అంశాలను ఎక్కువమందికి అందుబాటులోకి తీసుకురావచ్చు. ఇంతవరకు వ్యక్తిగత ట్వీట్స్ మాత్రమే గమనించేందుకు వీలుండేదని కాని ఈ టైమ్‌లైన్ వల్ల ఇప్పుడు సైన్‌ఇన్ చేయకపోయినా కథనాలు, సంభాషణలు చెక్‌చేసుకునే అవకాశం కలుగుతుందని ట్విటర్ మేనేజర్ పాల్ లాంబార్ట్ తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు.