వాషింగ్టన్: కరోనావైరస్ వ్యాప్తిపై చైనా తప్పుడు వాదనలను ప్రోత్సహిస్తోందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) పై మండిపడుతున్న అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సంస్థకు నిధులు అందజేసే విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి నిధుల్ని కాకుండా పాక్షికంగా అందించేందుకు అంగీకరించినట్టు సమాచారం.
అంచనా మొత్తంలో కొంత కోత వేసేందుకు నిర్ణయించిందంటూ ఫాక్స్ న్యూస్ నివేదించింది. మునుపటి నిధుల మొత్తం సంవత్సరానికి 400 మిలియన్ డాలర్లలో పదోవంతు మాత్రమే చెల్లించనుందని ముసాయిదా పత్రాన్ని ఉటంకిస్తూ తెలిపింది. డబ్ల్యూహెచ్‌ఓకు చైనా ఎంత మొత్తం అయితే చెల్లిస్తుందో అంతే సొమ్ము అమెరికా కూడా చెల్లించాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించినట్లు పేర్కొంది. (ఉచితంగా వెంటిలేటర్లు : ట్రంప్ కీలక ప్రకటన)
కాగా కరోనా వైరస్ సృష్టి చైనాలోనే జరిగిందని విరుచుకుపడుతున్నారు అమెరికా అధ్యక్షుడు. దీంతోపాటు వైరస్ వ్యాప్తి విషయంలో ప్రపంచాన్ని హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందని మండిపడుతున్న ట్రంప్ సంస్థకు ఇచ్చే నిధుల్ని ఏప్రిల్ 14న నిలిపివేశారు.అయితే ట్రంప్ ఆరోపణలను డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధులు తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. (కరోనా ఎప్పటికీ పోదు : డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక)
Comments
Please login to add a commentAdd a comment