‘ట్రంప్‌తో భారత్‌కు చాలా మేలు జరుగుతుంది’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరిపాలన వర్గంతో భారత్‌కు ఎంతో మేలు చేకూరనుందని అమెరికాలోని ప్రముఖ భారతీయ వ్యాపార మండలి(యూఎస్‌ఐబీసీ) తెలిపింది. అమెరికాలో యూఎస్‌ఐబీసీ ప్రముఖ వ్యాపార విభాగంగా పనిచేస్తోంది. దీని అధ్యక్షుడు ముఖేశ్ అఘి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ‘అమెరికాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ అవసరం ఉంది. ప్రస్తుతం జియోపొలిటికల్ విధానంలో భారత్ కూడా కాస్తంత ఆందోళనకరమైన పరిస్థితుల మధ్య ఉన్న నేపథ్యంలో ఢిల్లీకి కూడా వాషింగ్టన్ అవసరం ఉంది. ఇప్పటి వరకు భారత్-అమెరికాల మధ్య ఉన్న సంబంధాలను బట్టి చూస్తే ట్రంప్ పరిపాలన వర్గం భారత్‌కు చాలా ఉపకరించనుంది.
అమెరికా ఎందుకు భారత్ వైపు చూస్తుందంటే మొదటది భారత ఆర్థిక శ్రేయస్సు అనే అంశం అమెరికాకు మేలు చేయనుంది. ఇక రెండో అంశం ఏమిటంటే.. భారత్ తనను తాను సమర్థంగా రక్షించుకోగల సైనిక బలాన్ని నానాటికి పెంచుకుంటూ పోతుంది’ ఈ రెండు అంశాలు అమెరికా భారత్‌వైపు చూసేందుకు కారణం. అలాగే భారత్ కూడా అమెరికాను బలమైన దేశంగా నమ్ముతోంది. ట్రంప్ పాలన వర్గం మోదీ ప్రభుత్వం మధ్య బలమైన సానుకూల ఒప్పందాలు జరుగుతాయని నేను అనుకుంటున్నాను. ఈ ఏడాది తర్వాత వీరిద్దరు సమావేశం అయ్యే అవకాశం ఉంది’ అని ఆయన చెప్పారు.