న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్నేహితుడు స్టాన్లీ చెరా(78) కరోనాతో మృతిచెందారు. న్యూయార్క్ సిటీ రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీకి కూడా స్టాన్లీ భారీ విరాళాలు అందించారు. క్రౌన్ అక్వీసీషన్స్ పేరుతో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. న్యూయార్క్ నగరంలో అనేక భారీ భవంతులను ఈ సంస్థ నిర్మించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డోనాల్డ్ ట్రంప్ ప్రచారం కోసం స్టాన్లీ దాదాపు 4 లక్షల డాలర్లు విరాళంగా ఇచ్చారు. ట్రంప్ అల్లుడు జేర్డ్ కుషనర్‌తోనూ స్టాన్లీకి అనేక వ్యాపార సంబంధాలు ఉన్నాయి. గత ఏడాది న్యూయార్క్‌లో జరిగిన వెటరన్స్ డే పరేడ్‌లోనూ స్టాన్లీని తన ప్రాణ స్నేహితుడంటూ ట్రంప్ పరిచయం చేశారు. అంతేకాకుండా ఇటీవలే జరిగిన మీడియా సమావేశంలో తన స్నేహితుడు కరోనా బారిన పడ్డారని ట్రంప్ తెలిపిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment