ఫేస్బుక్, ట్విట్టర్‌, యూట్యూబ్ బ్లాక్! | Turkey Coup: Government Blocks Twitter, Facebook And YouTube | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్, ట్విట్టర్‌, యూట్యూబ్ బ్లాక్!

Published Sat, Jul 16 2016 11:51 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఫేస్బుక్, ట్విట్టర్‌, యూట్యూబ్ బ్లాక్! - Sakshi

ఫేస్బుక్, ట్విట్టర్‌, యూట్యూబ్ బ్లాక్!

అంకారా: సైనిక తిరుగుబాటు నేపథ్యంలో టర్కీ ప్రభుత్వం సోషల్ మీడియాను కట్టడి చేసింది. ప్రముఖ సామాజిక అనుసంధాన వేదికలైన ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్వంటి వాటిని బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని అక్కడి మీడియా వెల్లడించింది. శుక్రవారం రాత్రి 11.04గంటల ప్రాంతంలో ఈ మూడు వెబ్ సైట్లను టర్కీ ప్రభుత్వం బ్లాక్ చేసిందని, ఆ తర్వాత మరో గంటన్నర తర్వాత తిరిగి అన్ బ్లాక్ చేసిందని చెబుతోంది. కాగా, ఈ సంస్థలు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

టర్కీలో సైన్యం తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. దేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు కూడా ప్రకటించింది. దేశవ్యాప్తంగా మార్షల్ చట్టం అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. దేశంలో నియంతృత్వ పాలన, ఉగ్రవాదం కారణంగానే ఈ తిరుగుబాటు చేసినట్లు టర్కీ సైన్యం వెల్లడించింది. తిరుగుబాటులో భాగంగా రాజధాని అంకారా గగనతలంలో సైనిక విమానాలు, హెలికాప్టర్లతో సైన్యం పహారా కాసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ టీవీ, రేడియోను టర్కీ సైన్యం తన ఆధీనంలోకి ఈ ఘర్షణలు మరింత వ్యాపించకుండా ఉండేందుకే సోషల్ మీడియాను కట్డడి చేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement