‘పాస్‌వర్డ్స్‌ చెబితేనే అమెరికా రానిస్తాం’ | US Could Ask Visa Applicants for Social Media Passwords | Sakshi
Sakshi News home page

‘పాస్‌వర్డ్స్‌ చెబితేనే అమెరికా రానిస్తాం’

Published Wed, Feb 8 2017 12:12 PM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

‘పాస్‌వర్డ్స్‌ చెబితేనే అమెరికా రానిస్తాం’ - Sakshi

‘పాస్‌వర్డ్స్‌ చెబితేనే అమెరికా రానిస్తాం’

వాషింగ్టన్‌: ఇక నుంచి వీసాకోసం వచ్చేవారు తాము ఉపయోగిస్తున్న సోషల్‌ మీడియా పాస్‌ వర్డ్స్‌ను చెప్పేటట్లయితేనే రావాలని అమెరికా అడగనుంది. తమ దేశ భద్రతా చర్యల్లో భాగంగా ఇప్పటికే ఏడు ముస్లిం దేశాల దేశాలపై నిషేధం విధించిన నేపథ్యంలో తాజాగా చేసిన ఈ ప్రకటన మరింత ఆందోళన సృష్టించనుంది. ఇక నుంచి అమెరికా వచ్చే వారి వివరాలు చాలా క్షుణ్ణంగా పరిశీలించాలని ఇప్పటికే ట్రంప్‌ అన్ని దేశాల రాయబార కార్యాలయానికి ఆదేశాలు పంపించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం పలు మార్గదర్శకాలు వారికి సూచించినట్లు తెలిసింది.

ఇందులో భాగంగా ఇక నుంచి తమ దేశానికి వచ్చే వారు తాము ఉపయోగిస్తున్న సామాజిక అనుసంధాన వేదికల వివరాలు, వాటి పాస్‌వర్డ్‌లు కచ్చితంగా వీసాకు ముందు ధృవపత్రాలను తనిఖీ చేసే అధికారులకు కచ్చితంగా చెప్పాలని కోరనున్నారు. ముఖ్యంగా ఇప్పటికే నిషేధం విధించిన ప్రధాన ముస్లిం దేశాల నుంచి వచ్చే వారి విషయంలో ఈ కఠిన నిబంధనలు అమలుచేయాలని భావిస్తున్నారు.

‘మేం నిషేధం విధించిన దేశాల వారిని రాకుండా ఆపడం కష్టం కావొచ్చు.. ఒక వేళ వారు వస్తే కచ్చితంగా ఈ వివరాలు మాత్రం అడుగుతాం. అవి ఇస్తేనే వీసాకు అనుమతిస్తాం. అవిస్తే వారు ఎలాంటి వెబ్‌సైట్‌లు చూస్తున్నారనే విషయం మాకు తెలుస్తుంది. ఒక​వేళ వాళ్లు పాస్‌ వర్డ్స్‌ చెప్పకుంటే రావొద్దు’ అని అమెరికా అంతర్గత రక్షణ వ్యవహారాల కార్యదర్శి జాన్‌ కెల్లీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement