1984నాటి సిక్కుల ఊచకోత ఘటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై అమెరికాలో దాఖలైన ఓ పిటిషన్ను అక్కడి కోర్టు కొట్టివేసింది.
న్యూయార్క్: 1984నాటి సిక్కుల ఊచకోత ఘటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై అమెరికాలో దాఖలైన ఓ పిటిషన్ను అక్కడి కోర్టు కొట్టివేసింది. ఆరోపణ దారులు దాఖలు చేసిన పిటిషన్లో పరిపక్వత కలిగిన అంశాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.
సిక్కుల ఊచకోత ఘటన విషయంలో సోనియాగాంధీ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని, ఆమెపై కేసులు నమోదు చేయాలంటూ న్యూయార్క్లోని సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) అనే సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లో కొత్తగా అభివృద్ధి ఏమి లేదని, గతంలో పేర్కొన్న అంశాలే మళ్లీ చెప్తున్నారంటూ పిటిషన్ను కొట్టివేసింది.