ఇస్లామాబాద్ : పాకిస్థాన్లోని ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో రెండు చోట్ల యూఎస్ శుక్రవారం ద్రోణి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఏడుగురు తీవ్రవాదులు మృతి చెందారు. పాక్లోని పంజాబ్ తాలిబన్ కమాండర్ ఖార్రీ ఇమ్రాన్ను అంతమొందించే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.
అయితే మృతి చెందిన తీవ్రవాదుల్లో ఖార్రీ ఇమ్రాన్ ఉన్నదీ లేదని స్పష్టంగా తెలియలేదని తెలిపాయి. ఈ మేరకు శుక్రవారం డాన్ పత్రిక ఆన్ లైన్ పత్రికలో వెల్లడించింది. పాకిస్థాన్ లోని పెషావర్ ఆర్మీ పాఠశాలలో తాలిబన్ తీవ్రవాదులు సాగించిన నరమేధంలో 148 మంది మరణించారు. దీంతో పాక్ లోని తీవ్రవాదుల ఏరివేతకు స్థానిక ప్రభుత్వం దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.