US Military Drones
-
రష్యా నిర్లక్ష్యం.. వీడియో వదిలిన అమెరికా
రిచ్మాండ్: తమ నిఘా డ్రోన్‌ను రష్యా కూల్చేయడంపై విమర్శలు గుప్పిస్తున్న అమెరికా.. తాజాగా అందుకు సంబంధించిన సాక్ష్యాన్ని బయటపెట్టింది. దాదాపు నిమిషం నిడివి ఉన్న వీడియోను విడుదల చేసి రష్యా నిర్లక్ష్య ధోరణిని తప్పుబట్టింది. మార్చి 14వ తేదీన.. రష్యా యుద్ధ విమానం నల్ల సముద్రంపై అమెరికా నిఘా డ్రోన్‌ను ఢీకొట్టింది. అయితే.. చాకచక్యంగా వ్యవహరించిన అమెరికా సైన్యం.. తమ డ్రోన్‌ను కిందకు దించింది. ఆపై యూఎస్ యూరోపియన్ కమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘నల్ల సముద్రంపై అంతర్జాతీయ ఎయిర్‌స్పేస్‌లో రష్యాకు చెందిన రెండు ఎస్‌యూ–27 ఫైటర్ జెట్లు ఎలాంటి రక్షణ లేకుండా విన్యాసాలు చేపట్టాయి. అందులో ఒకటి యూఎస్‌కు చెందిన ఎంక్యూ–9 డ్రోన్‌ను ఢీకొట్టింది’’ అని సదరు ప్రకటనలో వెల్లడించింది. @HQUSAFEAFAF #RussiaIsCollapsing #RussiaIsLosing #RussiaIsATerroristState 🚨 pic.twitter.com/eYN91RXfbx — 🇸🇰 SKmartinTO 🇺🇲 ⚔️ 🇺🇳 (@SKmartinTO) March 16, 2023 VIDEO: Two #Russian Su-27s conducted an unsafe & unprofessional intercept w/a @usairforce intelligence, surveillance & reconnaissance unmanned MQ-9 operating w/i international airspace over the #BlackSea March 14. https://t.co/gMbKYNtIeQ @HQUSAFEAFAF @DeptofDefense @NATO pic.twitter.com/LB3BzqkBpY — U.S. European Command (@US_EUCOM) March 16, 2023 ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. సెకండ్ల వ్యవధిలోనే రెండుసార్లు డ్రోన్‌కు దగ్గరగా వెళ్లింది రష్యా ఫైటర్ జెట్. అంతేకాదు.. ఫ్లూయెల్ను అమెరికన్ డ్రోన్‌పై గుప్పించే యత్నం చేసిందని యూఎస్ మిలిటరీ ఆరోపిస్తోంది. ఢీ కొట్టడానికి ముందు ఎస్‌యూ-27 ఫ్యూయెల్‌ను కుమ్మరించింది. ఇది పూర్తిగా నిరక్ష్యం.. అన్ప్రొఫెషనల్మ్యానర్ అంటూ విమర్శించింది. ఇక అమెరికా విమర్శలపై రష్యా స్పందించింది. తప్పిదం ఎంక్యూ-9 డ్రోన్ తరపు నుంచే ఉందని పేర్కొంటూ రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే తాజా వీడియో నేపథ్యంలో మాస్కో వర్గాలు ఎలా స్పందిస్తాయనే ఆసక్తి నెలకొంది. -
మళ్ళీ అదే అనిశ్చితి!
అనుకున్నదే అయింది. రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం తరువాత అమెరికా, దాని మిత్రపక్ష సేనలు అఫ్ఘానిస్తాన్ నుంచి మే 1న వైదొలగడం మొదలవగానే, తాలిబన్ల విస్తరణ, ఆధిపత్యం పెరుగుతూ వస్తోంది. ఒక్కొక్క జిల్లాను హస్తగతం చేసుకుంటూ తాలిబన్లు శుక్రవారం తమ జన్మస్థానమైన కాందహార్‌లోకి ప్రవేశించాయి. భారత్ సైతం కాందహార్‌లోని దౌత్య కార్యాలయ సిబ్బందిని హడావిడిగా వెనక్కి రప్పిస్తోంది. ఒకప్పుడు తాలిబన్ల కేంద్రస్థానమైన కాందహార్ అఫ్ఘాన్‌లో రెండో అతిపెద్ద నగరం. అఫ్ఘాన్ సేనలతో తాలిబన్ల తీవ్రఘర్షణ, అందులో రోజుకు 200 నుంచి 600 మంది దాకా బాధితులు, దేశంలో 85 శాతం తమ చేతుల్లో ఉందన్న తాలిబన్ల వాదన చూస్తుంటే– అఫ్ఘాన్‌లో ఏం జరగచ్చో అర్థమవుతూనే ఉంది. ఆ ఊహే నిజమైతే 1996లో లానే తాలిబన్ల పడగ నీడలోనే అఫ్ఘాన్ జనజీవితం ఇక లాంఛనమే కావచ్చు. ఈ పరిణామాల ప్రభావం భారత ఉప ఖండంపై ఎలా ఉంటుందన్న దాని మీద చర్చ ఊపందుకున్నది అందుకే! అఫ్ఘాన్ ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమంటూనే తాలిబన్లు సాయుధ సంఘర్షణకు దిగడం విచిత్రం. భారత్ మాత్రం ప్రస్తుత అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ప్రభుత్వాన్నే ఇప్పటికీ గట్టిగా సమర్థిస్తోంది. మరోపక్క బైడెన్ అమెరికన్ సర్కారు మాటల ప్రకారం మరో నెలన్నరలో ఆగస్టు 31 కల్లా అఫ్ఘాన్ నుంచి అమెరికన్ సేనల ఉపసంహరణ పూర్తి కానుంది. దాంతో సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం అప్పటి జార్జ్ బుష్ అమెరికన్ ప్రభుత్వం అఫ్ఘాన్‌లోని తాలిబన్ ఏలుబడి పైన, ఉగ్రవాద అల్ కాయిదా సంస్థపైన మొదలు పెట్టిన సైనిక దాడి ప్రతీకార యజ్ఞానికి అర్ధంతరంగా తెర పడనుంది. చరిత్రలోకెళితే, ఇస్లామిక్ తీవ్రవాదుల బృందం అల్ కాయిదా 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో 4 విమానాలను హైజాక్ చేసి, ‘వరల్డ్ ట్రేడ్ సెంటర్’ భవనాలపైన, అమెరికా రక్షణశాఖ కేంద్ర కార్యాలయం పెంటగాన్‌పైన దాడులు జరిపింది. 3 వేల మంది అమాయకుల దుర్మరణానికి కారణమైంది. ‘9/11 తీవ్రవాద దాడులు’గా ప్రసిద్ధమైన ఆ ఘటన, తాలిబన్ల అండ ఉన్న ఆ దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా అంతం చేయడం, ‘ఉగ్రవాదంపై యుద్ధం’ పేరిట అమెరికన్ సేనలు అఫ్ఘాన్‌లో ప్రవేశించడం – ఓ సుదీర్ఘ చరిత్ర. ఉగ్రవాదులు అఫ్ఘాన్‌ను స్థావరంగా చేసుకోవడానికి అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యాన్ని సాధించా మంటూ సేనల్ని ఉపసంహరిస్తూ, అమెరికా – ‘నాటో’ సమష్టి ప్రకటన చేశాయి. క్షేత్రస్థాయిలో అది నేతి బీరకాయలో నెయ్యే కావచ్చు! నిజానికి, 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన ఎన్నికల వాగ్దానమూ, తాజా బైడెన్ ప్రభుత్వం చేపడుతున్నదీ ఒకటే – అమెరికా సేనల ఉపసంహరణ! కాకపోతే, ఇరవయ్యేళ్ళు ఆతిథ్యమిచ్చిన అఫ్ఘాన్ ప్రభుత్వానికి మాట మాత్రంగానైనా చెప్పకుండా కీలకమైన బాగ్రమ్ సైనిక వైమానిక క్షేత్రం నుంచి అమెరికా సేనలు రాత్రికి రాత్రి వెళ్ళిపోవడం విచిత్రం. అఫ్ఘాన్‌లో కొంత అభివృద్ధికీ, అక్షరాస్యతకూ దోహదపడ్డ అమెరికా ఆఖరికొచ్చేసరికి అక్కడ శాంతిస్థాపన కోసం చూడలేదు. మోయలేని బరువుగా మారిన సైనిక జోక్యాన్ని ఆపేసి, తన దోవ తాను చూసుకుంది. తాజా దండయాత్రలో కీలక బగ్రామ్ వైమానిక క్షేత్రం కూడా తాలిబన్ల చేతికి వచ్చిందంటే, తరువాతి లక్ష్యం అక్కడికి దగ్గరలో ఉన్న కాబూలే. అమెరికా సేనలు దేశం నుంచి తప్పుకోవాలన్నది తొలి నుంచీ తాలిబన్ల డిమాండ్. అది తీరుతున్నా తాలిబన్లు ఘర్షణకు దిగుతున్నారంటే, అది దేనికోసమో అర్థం చేసుకోవచ్చు. మరోపక్క అఫ్ఘాన్ దేశ నిర్మాణం కోసమేమీ అమెరికా అక్కడకు వెళ్ళలేదనీ, ఆ దేశాన్ని ఎలా నడపాలి, భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలనే నిర్ణయం అఫ్ఘాన్ ప్రజలదేననీ బైడెన్‌కు హఠాత్ జ్ఞానోదయం ప్రదర్శించారు. అఫ్ఘాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణను ఇప్పటికే చైనా తప్పుబట్టింది. ఆ దేశం నుంచి తమ పౌరుల్ని సురక్షితంగా వెనక్కి తెచ్చే పనిలో పడింది. భారత దౌత్య సిబ్బంది పరిస్థితీ అదే. గతంలో 9/11 ఘటనకు రెండేళ్ళ ముందే 1999 డిసెంబర్లో కాందహార్ విమాన హైజాక్ ఉదంతం ద్వారా తాలిబన్ల దెబ్బ భారత్ రుచిచూసింది. ఇండి యన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని తాలిబన్లు హైజాక్ చేయడం, అందులోని అమాయక ప్రయా ణికుల కోసం అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం నలుగురు ఉగ్రవాదులను విడిచిపెట్టడం ఓ తరానికి కళ్ళ ముందు కదలాడే దృశ్యం. పాకిస్తాన్, చైనాలతో పాటు ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్’ ద్వారా మనమూ అఫ్ఘాన్‌తో సరిహద్దులు పంచుకుంటున్నాం. అందుకే, ఇప్పుడక్కడ పాక్, చైనాలకు అనుకూలమైన తాలిబాన్ల ప్రాబల్యం భౌగోళికంగా, రాజకీయంగా మనకు పెద్ద చిక్కే. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులతో అంటకాగిన తాలిబన్ మూకలు ఇప్పటికిప్పుడు పవిత్ర మైపోయాయని అనుకోలేం. అమెరికాతో తాలిబన్లు మాట ఇచ్చినట్టు ‘జిహాద్’ను కేవలం తమ దేశానికీ పరిమితం చేస్తాయనీ నమ్మలేం. భారత్‌తో సహా పొరుగు దేశాల్లో జిహాద్‌ను సంకీర్తించే వారు అఫ్ఘాన్‌ను మళ్ళీ తమ అడ్డాగా మార్చుకొనే అవకాశాల్నీ కొట్టిపారేయలేం. వెరసి, సాయుధ తాలిబన్లు గద్దెనెక్కితే శాంతి సౌఖ్యాల కోసం వెంపర్లాడుతున్న మానవతావాదులకూ, మహిళ లకే కాదు... అఫ్ఘాన్ పునర్నిర్మాణం, సహాయ కార్యక్రమాల్లో 300 కోట్ల డాలర్లకు పైగా వెచ్చించిన మన దేశానికీ దెబ్బే. మూడు దశాబ్దాలుగా రకరకాల కారణాలతో అఫ్ఘాన్ రక్తసిక్తం కావడం, రెండు దశాబ్దాల సైనిక జోక్యం తరువాతా ఆ దేశం అనిశ్చితిలోనే మిగలడమే ఓ విషాదం. -
పాక్ ఉగ్రస్థావరాలపై అమెరికా పంజా
-
అమెరికా అయినా వదిలే ప్రసక్తే లేదు : పాక్
ఇస్లామాబాద్ : కవ్వింపు చర్యలు, ఉగ్రసంస్థలకు పరోక్ష సాయంపై పెదవి విప్పని పాకిస్థాన్ మరోసారి తన ధోరణిని బయటపెట్టింది. తమ దేశ సరిహద్దు, ఉపరితలాలపై తిరిగే డ్రోన్లపై దాడులు తప్పవని హెచ్చరించింది. అయితే ఈ క్రమంలో అమెరికా డ్రోన్ లు అయినా సరే వదిలే ప్రసక్తే లేదని ప్రకటించటం చర్చనీయాంశమైంది. పాక్ గగనతలంలోకి ప్రవేశించే ఏ డ్రోన్‌నూ విడిచిపెట్టం. నిబంధనలకు విరుద్ధంగా పాక్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఎవరైనా వ్యవహరిస్తుంటే చూస్తూ ఊరుకోబోం. అవి అమెరికాకు చెందిన డ్రోన్లు అయినా సరే కూల్చేయాల్సిందే. ఈ మేరకు పాక్ భద్రతా దళాలకు కఠిన సూచనలు చేశాం అని ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ సోహైల్ అమన్ తెలిపారు. ఇదిలా ఉంటే పాక్ చేష్టలపై అమెరికా గత కొన్నాళ్లుగా తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టాక ఆ ధోరణి మరీ ఎక్కువైంది. కాగా, అఫ్ఘనిస్థాన్ పాకిస్థాన్ సరిహద్దులోని గిరిజన ప్రాంతాల్లో 2004 నుంచి అమెరికా సైన్యం గస్తీ కాస్తోంది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఎక్కువగా తలదాచుకునే అవకాశం ఉండటంతో డ్రోన్ పర్యవేక్షణ నిర్వహిస్తూ వస్తోంది. దీనిపై పాకిస్థాన్ వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వస్తూ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయ నేపథ్యంలో అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. -
పాక్‌లో ఉగ్రస్థావరాలపై అమెరికా దాడులు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. పాక్ పొరుగుదేశం అఫ్గానిస్తాన్‌లోనూ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులను అమెరికా తీవ్రతరం చేయనుంది. ట్రంప్ యంత్రాంగంలోని అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం... డ్రోన్ దాడులను విస్తృతం చేయడం, పాక్‌కు ఇస్తున్న నిధుల్లో కోత విధించడం లేదా వాటిని మళ్లించడం, నాటోయేతర మిత్రదేశంగా పాక్‌కు ఉన్న హోదాను తగ్గించడం తదితర చర్యలకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోంది. అయితే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు అమెరికా ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నా విఫలమవుతోందనీ, ఇప్పుడు కూడా ప్రయత్నం ఫలిస్తుందన్న నమ్మకం లేదని కొంతమంది అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో తమకు పాక్ నుంచి గట్టి సహాకారం కావాలి కానీ, ఆ దేశంతో సంబంధాలను తెంచుకోవడం కాదని యూఎస్ అధికారులు పేర్కొన్నారు. త్వరలో ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై ఇంకా స్పష్టంగా నిర్ణయించలేదన్నారు. -
ప్రాణాలు అరచేతబట్టుకొని 56 వేలమంది..
మోసుల్: ఇరాక్ ప్రధాన నగరం మోసుల్‌ను మరో 56వేలమంది ప్రజలు విడిచిపెట్టి వెళ్లిపోయారు. ప్రాణాలు అరచేతబట్టుకొని సమీపంలోని ప్రాంతాలకు పరుగులు తీశారు. కట్టుబట్టలతో వారు విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని అక్కడి హక్కుల సంస్థ ఒకటి తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చెర నుంచి తిరిగి మోసుల్ ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు అమెరికా-ఇరాక్ సంయుక్త బలగాలు గత నెల నుంచి ఆపరేషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే గత రెండు వారాల్లో నవంబర్ 4న 22,224మంది ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లగా తాజాగా ఒకేసారి 56 వేలమంది వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ సంస్థ పేర్కొంది. అటు ఉగ్రవాదులకు, బలగాలకు మధ్య బీకర యుద్ధం జరుగుతోంది. బాంబులు, మోర్టార్ షెల్స్, బుల్లెట్ల వర్షంతో మోసుల నగరమంతా మారిమోగిపోతోంది. ఎలాగైన ఉగ్రవాదుల తుడిచిపెట్టి ప్రశాంతమైన నగరాన్ని తిరిగి ప్రజలకు అప్పగించాలనే దృఢనిశ్చయంతో బలగాలు ముందుకు కదులుతున్నాయి. ఇందులో భాగంగా అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పడంతో వారంతా ప్రాణాలు అరచేతబట్టుకొని వలసదారులుగా వెళ్లి తమ నివాసాలకోసం ఎదురు చూస్తున్నారు. వీరికి పునరావాసం కోసం బలగాలే దాదాపు వెయ్యికిపైగా టెంటు షెల్టర్లు కూడా ఏర్పాటుచేశారు. -
ఆఫ్ఘాన్‌లో 16 మంది తీవ్రవాదులు హతం
కాబూల్ : ఆఫ్ఘానిస్థాన్‌లోని కుంద్ ప్రావిన్స్‌లో అమెరిక జరిపిన ద్రోణుల దాడుల్లో 16 మంది మిలిటెంట్లు హతమయ్యారు. ఈ మేరకు ఆ దేశ మిలటరీ ఉన్నతాధికారులు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం రాత్రి జరిపిన ఈ దాడిలో తాలిబాన్ సీనియర్ నాయకుడు ముల్హా జన్నత్ గుల్తోపాటు మరో 15 మంది మరణించారని పేర్కొన్నారు. అలాగే రెండు వాహనాలు కూడా ధ్వంసమైనాయని వెల్లడించారు. -
అఫ్గాన్ తాలిబాన్‌కు కొత్త నేత
అమెరికా డ్రోన్ దాడిలో మన్సూర్ మృతిని నిర్ధారించిన తాలిబాన్లు కాబూల్: అఫ్గానిస్తాన్ తాలి బాన్ ఉగ్రవాద సంస్థ కొత్త అధిపతిగా హైబతుల్లా అఖుంద్జాదాను ఎన్నుకున్నట్టు ఆ సంస్థ బుధవారం తెలిపింది. సీనియర్ నేతలు సిరాజుద్దీన్ హక్కానీ, ముల్లా యాకూబ్‌లు హైబతుల్లాకు డిప్యూటీలుగా ఉంటారని వెల్లడించింది. పాకిస్తాన్లో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో తమ అగ్రనేత మన్సూర్ మృతిచెందినట్టు గా తాలిబాన్ నిర్ధారించింది. మన్సూర్ మృతితో హైబతుల్లాకు అగ్రపీఠాన్నీ కట్టబెట్టారు. మిలిటరీ కమాండర్‌గా కంటే మత నాయకుడిగానే ఆయన ప్రసిద్ధికెక్కారు. మన్సూర్‌కు ఉన్న ఇద్దరు డిప్యూటీల్లో ఇతడు ఒకరు. హైబతుల్లా.. తాలిబాన్ చీఫ్ జస్టిస్.. అఫ్గాన్ తాలిబాన్ కొత్త అధినేత హైబతుల్లా.. బయటి ప్రపంచానికి అంతగా తెలియని పేరు. గతంలో తాలిబాన్‌కు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. వారి ఉలేమాకు అధినేతగా ఉన్నారు. మత నియమాలను కచ్చితంగా పాటించాలనే విషయంలో కచ్చితంగా ఉండేవారు. తాలిబాన్ మిలటరీ ఆపరేషన్లకు సంబంధించిన పలు ఫత్వాలను జారీ చేశారు. కాందహార్ సమీపంలోని పంజ్వాయి జిల్లాకు చెందిన హైబతుల్లా.. అక్కడి నూర్జాయీ తెగకు చెందిన వారు. తాజాగా అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో హతమైన తాలిబన్ చీఫ్ మన్సూర్ తాలిబన్లో వర్గ విభేదాలను ప్రోత్సహించారని, అందువల్లనే తాలిబాన్ బలహీనమైందని, హైబతుల్లా నేతృత్వంలో మళ్లీ బలపడుతుందని భావిస్తున్నారు. -
'ఔను.. మా నాయకుడి మృతి వాస్తవమే'
కాబూల్: తాలిబాన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ ముల్లా అక్తర్ మన్సూర్ మృతిపై ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. ఈ మేరకు మన్సూర్ మృతిని ధృవీకరిస్తూ బుధవారం తాలిబాన్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో మన్సూర్ మృతి చెందిన విషయం వాస్తవమే అని అంగీకరించింది. అలాగే కొత్త చీఫ్‌ను సైతం తాలిబాన్ సంస్థ ప్రకటించింది. ముల్లా హైబతుల్లా అకుంద్ కొత్త చీఫ్‌గా పగ్గాలు చేపట్టినట్లు తాలిబాన్ సంస్థ వెల్లడించింది. తాలిబాన్ నేత ముల్లా మహమ్మద్ ఒమర్ 2013లో పాక్‌లో చనిపోయాక 2015, జూలైలో తాలిబాన్ గ్రూపు పగ్గాలను ముల్లాహ్ అక్తర్ మన్సూర్ చేపట్టాడు. అయితే అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో మన్సూర్ మృతి చెందాడని కొన్ని రోజులుగా వార్తలొస్తుంన్న విషయం తెలిసిందే. కాగా, తమ భూభాగంలో అమెరికా వైమానిక దాడులు జరపడం తమ దేశ సార్వ భౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని పాకిస్తాన్ ప్రభుత్వం దీనిపై మండిపడింది. -
తాలిబాన్ నేత మృతిని ధ్రువీకరించలేం: షరీఫ్
లండన్: ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గ్రూప్ చీఫ్ ముల్లాహ్ అక్తర్ మన్సూర్ మృతిని ధ్రువీకరించలేమని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తెలిపారు. అమెరికా సైనిక దళాలు జరిపిన డ్రోన్ దాడుల్లో మన్సూర్ హతమైనట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నవాజ్ లండన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాలిబాన్ చీఫ్ మృతిపై తమకు ఇంకా నివేదికలు అందాల్సి ఉందన్నారు. మాన్సుర్ మృతిని ధ్రువీకరించేందుకు విచారణ జరుపుతున్నట్లు నవాజ్ పేర్కొన్నారు. అయితే డ్రోన్ దాడులకు సంబంధించి అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి పాక్ ఆర్మీ చీఫ్లో మాట్లాడినట్లు చెప్పారు. మరోవైపు ఘటనా స్థలంలో వలీ మొహమద్ పేరుతో ఉన్న ఓ పాస్‌పోర్టు లభించినట్లు పాక్ అధికారి తెలిపారు. వైమానిక దాడుల్లో మృతి చెందినవారిలో ఓ మృతదేహాన్ని స్థానిక ట్యాక్సీ డ్రైవర్‌గా గుర్తించినట్లు చెప్పారు. మరో మృతదేహాన్ని గుర్తించాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా తమ భూభాగంలో అమెరికా వైమానిక దాడులు జరపడం తమ దేశ సార్వ భౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని పాకిస్తాన్ ప్రభుత్వం మండిపడింది. కాగా తాలిబాన్ నేత ముల్లా మహమ్మద్ ఒమర్ 2013లో పాక్‌లో చనిపోయాక 2015, జూలైలో తాలిబాన్ గ్రూపు పగ్గాలను ముల్లాహ్ అక్తర్ మన్సూర్ చేపట్టాడు. -
అఫ్గాన్ తాలిబాన్ చీఫ్ హతం
పాక్‌లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో మన్సూర్ మృతి వాషింగ్టన్/కాబూల్: అమెరికా సైనిక దళాలు పాకిస్తాన్లో జరిపిన డ్రోన్ దాడుల్లో అఫ్గానిస్తాన్ తాలిబాన్ గ్రూపు అగ్రనేత ముల్లాహ్ అక్తర్ మన్సూర్ హతమయ్యాడు. అఫ్గాన్‌లో శాంతి ప్రక్రియకు పెనుముప్పుగా పరిణమించిన తాలిబాన్ గ్రూపునకు మన్సూర్ మరణం పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. అఫ్గాన్ సరిహద్దులోని పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ ప్రాంతంలో శనివారం అమెరికా ప్రత్యేక దళాలు మానవ రహిత డ్రోన్ల ద్వారా జరిపిన వైమానిక దాడుల్లో మన్సూర్ హతమైనట్టు అమెరికా, అఫ్గాన్ అధికారులు ధ్రువీకరించారు. అహ్మద్ వాల్టౌన్కు సమీపంలోని మారుమూల ప్రాంతమైన దాల్బందిలో ఒక వాహనంలో మన్సూర్, మరొక మిలిటెంట్ వెళుతుండగా ఈ దాడులు జరిగాయి. ఈ దాడికి అమెరికా అధ్యక్షుడు ఒబామా అనుమతి ఇచ్చారని ఆ దేశ అధికారులు తెలిపారు. తాలిబాన్ గ్రూపు కొత్త నాయకుడిని ఎన్నుకుని కాబూల్‌కు రావాలని, ఒక రాజకీయ పార్టీ మాదిరిగా వ్యవహరించాలని అఫ్గాన్ రక్షణ శాఖ ప్రతినిధి దౌలత్ వాజిరి హితవు పలికారు. మన్సూర్‌తో అమెరికా బలగాలకు, అఫ్గాన్ ప్రజలకు ముప్పు ఉందని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ అన్నారు. తాలిబాన్ నేత ముల్లా మహమ్మద్ ఒమర్ 2013లో పాక్‌లో చనిపోయాక 2015, జూలైలో తాలిబాన్ గ్రూపు పగ్గాలను మన్సూర్ చేపట్టాడు. ఇదిలా ఉండగా తమ భూభాగంలో అమెరికా వైమానిక దాడులు జరపడం తమ దేశ సార్వ భౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని పాకిస్తాన్ ప్రభుత్వం మండిపడింది. -
ఐసిస్ భారత చీఫ్ షఫీ హతం!
సిరియాలో అమెరికా డ్రోన్ దాడిలో మృతి న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థ భారత విభాగం చీఫ్ మహమ్మద్ షఫీ అర్మార్ అలియాస్ యూసుఫ్ ఇటీవల సిరియాలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో హతమైనట్లు తెలుస్తోంది. ‘అతడు మృతి చెందినట్లు తెలిసింది.ఐసిస్ ప్రాబల్యమున్న సిరియా నుంచి సమాచారం రావడానికి కొంత సమయం పట్టొచ్చు’ అని భారత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఐసిస్ అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీకి ముఖ్య సన్నిహితుడైన షఫీ(26) భారత్‌లో ఐసిస్ విభాగాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు సహకరిస్తున్నాడు. అతడు 30 మందిని ఈ ఉగ్రవాద సంస్థలో చేర్పించినట్లు సమాచారం. భారత్‌లో ప్రతి రాష్ట్రంలో ఐసిస్ శాఖ ఏర్పాటుకు అతడు ప్రణాళిక వేశాడని భారత్‌లో అరెస్టయిన ఐసిస్ ఉగ్రవాదులు విచారణలో వెల్లడించినట్లు అధికారులు చెప్పారు. షఫీ ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల్లో దాదాపు 700 మంది భారతీయ యువకులతో సంబంధాలు నెరుపుతున్నట్లు నిఘా అధికారులు చెప్పారు. కర్ణాటకలోని భక్తల్కు చెందిన షఫీ అన్న సుల్తాన్ అర్మార్ కూడా గత ఏడాది వరకు ఐసిస్ భారత విభాగానికి నాయకత్వం వహించాడు. 2015 మార్చిలో అమెరికా ద్రోన్ దాడిలో హత మయ్యాడు. -
వైమానిక దాడులు: 14 మంది తీవ్రవాదులు మృతి
ఇస్లామాబాద్: పాక్ - ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దులోని ఉత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతంలో యూఎస్, పాక్ దళాలు సంయుక్తంగా వైమానిక దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 14 మంది తీవ్రవాదులు మరణించారని పాక్ నిఘా ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. మృతి చెందిన తీవ్రవాదులను గుర్తించవలసి ఉందని తెలిపారు. దత్తకేల్ ప్రాంతంలో తీవ్రవాదులే లక్ష్యంగా జరిపిన దాడుల్లో 10 మంది మరణించారని... వారిలో నలుగురు విదేశీ తీవ్రవాదులున్నారని చెప్పారు. అలాగే తీవ్రవాదులకు చెందిన భారీ ఆయుధ సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని... ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. తాలిబన్ తీవ్రవాదులను అంతమొందించేందుకు ఉత్తర వజీరిస్థాన్‌లో పాకిస్థాన్ సైనిక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
పాక్‌లో ఏడుగురు తీవ్రవాదులు హతం
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో రెండు చోట్ల యూఎస్ శుక్రవారం ద్రోణి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఏడుగురు తీవ్రవాదులు మృతి చెందారు. పాక్‌లోని పంజాబ్ తాలిబన్ కమాండర్ ఖార్రీ ఇమ్రాన్‌ను అంతమొందించే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. అయితే మృతి చెందిన తీవ్రవాదుల్లో ఖార్రీ ఇమ్రాన్ ఉన్నదీ లేదని స్పష్టంగా తెలియలేదని తెలిపాయి. ఈ మేరకు శుక్రవారం డాన్ పత్రిక ఆన్ లైన్ పత్రికలో వెల్లడించింది. పాకిస్థాన్ లోని పెషావర్ ఆర్మీ పాఠశాలలో తాలిబన్ తీవ్రవాదులు సాగించిన నరమేధంలో 148 మంది మరణించారు. దీంతో పాక్ లోని తీవ్రవాదుల ఏరివేతకు స్థానిక ప్రభుత్వం దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
పాక్ తాలిబన్ చీఫ్ హతం
పెషావర్/ఇస్లామాబాద్: ఉత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతంపై అమెరికా ద్రోన్ విమానం జరిపిన దాడిలో పాకిస్థాన్ తాలిబన్ అధినేత హకీముల్లా మెహసూద్ మరణించినట్లు ఆ దేశ మీడియా శుక్రవారం రాత్రి వెల్లడించింది. మెహసూద్ సహా మొత్తం ఆరుగురు ఈ దాడిలో మరణించినట్లు పేర్కొంది. దాండే దర్పఖేల్ ప్రాంతంలోని ఓ ఆవరణ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు పాక్ ఇంటిలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ డాన్ పత్రిక తెలిపింది. రెండు క్షిపణులు ఢీకొట్టడంతో ఆవరణ పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో పాకిస్థాన్ తాలిబన్ల సమావేశం జరుగుతోందని ఆ కథనం వివరించింది. ఈ ఆవరణను మెహసూద్ తరచు ఉపయోగిస్తుంటాడని సమాచారం. నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ)కు నేతృత్వం వహిస్తున్న మెహసూద్తో పాటు మెహసూద్ బంధువు, వ్యక్తిగత బాడీగార్డ్ అయిన తారిక్ మెహసూద్, డ్రైవర్ అబ్దుల్లా మెహసూద్ మరణించినవారిలో ఉన్నారు. భద్రతా దళాలను ఉటంకిస్తూ జియో న్యూస్ కూడా మెహసూద్ మరణ వార్తను ప్రకటించింది. అనంతరం తాలిబన్ వర్గాలు కూడా మెహసూద్ మృతిని ధ్రువీకరించాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మిరాన్షా ప్రాంతంలో అంత్యక్రియలు జరుగుతాయని తెలిపాయి. తాలిబాన్, ఆల్ కాయిదా అగ్ర నాయకత్వానికి తగులుతున్న వరుస ఎదురుదెబ్బల్లో ఇది తాజా సంఘటన అవుతుందని భావిస్తున్నారు. అమెరికా ద్రోన్లు పాక్ గిరిజన ప్రాంతం లక్ష్యంగా పదేపదే దాడులకు దిగుతున్న సంగతి విదితమే. తాజా దాడి అనంతరం పరిణామాలపై పాక్ హోం మంత్రి చౌదరి నిసార్ అలీ ఖాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తోనూ, ఇతర రాజకీయ నేతలతోనూ చర్చించారు. దేశంలో శాంతిని నెలకొల్పేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. గత నెలలో షరీఫ్ అమెరికా పర్యటన అనంతరం ద్రోన్ దాడి జరగడం ఇది రెండోసారి. అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ అయిన షరీఫ్ సీఐఏ ప్రేరేపిత ద్రోన్ దాడుల గురించి ప్రస్తావించారు. దాడులు నిలిపివేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అఫ్ఘానిస్థాన్‌లో టీటీపీ డిప్యూటీ చీఫ్ లతీఫ్ మెహసూద్‌ను అమెరికా ప్రత్యేక దళాలు పట్టుకున్న తర్వాత కొద్దిరోజులకే తాజా దాడి జరగడం విశేషం. బాంబులు, ఆత్మాహుతి దాడులతో టీటీపీ పాక్ దళాలపై విరుచుకుపడుతోంది. దేశవ్యాప్తంగా వేలాదిమంది ఈ దాడుల్లో మరణించారు. మెహసూద్‌కు ముందు టీటీపీ చీఫ్‌గా వ్యవహరించిన బైతుల్లా మెహసూద్ కూడా ద్రోన్ దాడిలోనే మరణించాడు. బైతుల్లా మరణానంతరం 2009లో హకీముల్లా టీటీపీ పగ్గాలు చేపట్టాడు.