న్యూయార్క్ ఎయిర్ పోర్టు
- విమానంలో కరెన్సీ అక్రమ తరలింపు
- న్యూయార్క్ ఎయిర్ పోర్టులో అడ్డంగా దొరికిపోయిన పైలట్
ఆకాశమార్గంలో నగదు అక్రమ తరలింపునకు పాల్పడ్డ పైలట్ ఉదంతం అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. నిందితుడి దగ్గర లభించిన అక్రమ కరెన్సీ ముంబై నుంచి సరఫరా కావటంతో ఇటు భారతీయ అధికారులూ కలవరపాటుకు గురయ్యారు. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. టెక్సాస్ కు చెందిన ఆంటోనీ వార్నర్ (55) ఓ కమర్షియల్ పైలట్. వేరొక మిమానంలో ముంబై నుంచి న్యూయార్క్ కు భారీగా అక్రమ డాలర్లు తరలిస్తున్న ఆయనను లిబర్టీ ఇంజర్నేషనల్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
ల్యాప్ టాప్ బ్యాగులో దాచిన రెండు లక్షల యూఎస్ డాలర్లతోపాటు భారీగా ఆభరణాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత డబ్బు, నగలపై వార్నర్ వివరణ అనుమానాస్సదంగా అనిపించడంతో అతణ్ని అరెస్టుచేశామని ఇమిగ్రేషన్ అధికారుల చెప్పారు. కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ సైతం దర్యాప్తులో పాలుపంచుకుంటున్న ఈ కేసులో నేరణం నిరూపణ అయితే వార్నర్ కు గరిష్టంగా ఐదేళ్లు జైలు శిక్షపడే అవకాశం ఉంది. అయితే ముంబై నుంచి న్యూయార్క్ కు వార్నర్ ప్రయాణించిన విమానం ఏ సంస్థకు చెందిందో తెలిపేందుకు నిరాకరించారు అధికారులు!