సాక్షి, ముంబై: ఉగ్రవాదుల దాడులను సమర్థంగా తిప్పికొట్టడంలో ముంబై పోలీసుశాఖకు సహకరించడనికి అమెరికా అంగీకరించింది. ఇందుకు అవసరమైన అత్యధునిక ఆయుధాలు అందజేస్తామని ప్రకటించారు. ఇందులో 250కిపైగా రకాల ఆయుధాలు ఉన్నాయి. కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ఆయుధాలు ముంబై పోలీసుశాఖకు ఉచితంగానే అందజేయనుంది. 2008 నవంబరు 26న 10 మంది ఉగ్రవాదులు నగరంలోని ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ), కామా ఆస్పత్రి, నారిమన్ హౌస్ ప్రాంతాల్లో దాడులు చేసి 250కిపైగా అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనల్లో వందలాది మంది గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అజ్మల్ కసబ్ మినహా మిగతా తొమ్మిది మంది ఉగ్రవాదులను హతమర్చారు. తామంతా పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు ప్రాణాలతో పట్టుబడ్డ కసబ్ వెల్లడించాడు.
ఉగ్రవాదదాడులను ప్రోత్సహిస్తోందం టూ పాక్‌పై గతంలో వచ్చిన ఆరోపణలు కసబ్ వెల్లడించిన విషయాలతో రుజువయ్యాయి. కసబ్‌కు చివరికి ఉరిశిక్ష విధించడం తెలి సిందే. ఈ దాడుల కేసుల దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులకు అమెరికా సాయం చేసింది. వీటి వెనుక పాకిస్థాన్ హస్తముందని రుజువు చేయడానికి సాక్ష్యాధారాలను సేకరించారు. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అధికారులు ఈ మేరకు ముంబై కోర్టులో సాక్ష్యమిచారు. ఉగ్రవాదదాడులను తిప్పికొట్టేందుకు భారత్‌కు అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చిన అమెరికా ఈ మేరకు మనదేశ పోలీసులు, దర్యాప్తు సంస్థలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చిం ది. భారత పారామిలిటరీ దళాల అధికారులు, సిబ్బంది కూడా ఈ శిక్షణకు హాజరయ్యారు.
ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఉపయోగించే అత్యాధునిక ఆయుధాలు, ఇతర సామాగ్రిని ఎలా ఉపయోగించడంపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముంబై సీనియర్ పోలీసు అధికారి కూడా హాజరయ్యారు. ఆయుధాల అప్పగింతపై భారత్‌కు చెందిన ‘బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్’ను అమెరికా సంప్రదించింది. ఉగ్రవాద దాడుల నిరోధంపై శిక్షణ సమయంలో తీసుకొచ్చిన అత్యధునిక ఆయుధాలు, ఇతర పరికరాలను ప్రముఖ నగరాలలోని పోలీసు దళాల కు అందజేయాలని నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ముంబై పోలీసు శాఖకు కూడా ఉచితంగా ఆయుధాలు అందనున్నాయి. బాం బును గుర్తించడం, నిర్వీర్యం చేసే పరికరాలు, పోర్టబుల్ బాంబు స్కానర్, డుయర్ బ్లాస్టర్, క్విక్ రెస్పాన్ టీం కోసం అసెండర్, డిసెండర్, ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులు ఉపయోగించే పరికరాలు అమెరికా అందజేసే వాటిలో ఉన్నాయి.
ముంబై పోలీసులకు అమెరికా ఆయుధాలు
Published Sun, Jun 1 2014 11:25 PM | Last Updated on Thu, Apr 4 2019 3:48 PM
Advertisement
Advertisement