Newark
-
అమెరికానే బురిడీ కొట్టించిన నిత్యానంద.. అసలు కైలాస దేశమే లేదు..
వాషింగ్టన్: వివాదాస్పద గురువు నిత్యానంద ఏకంగా అమెరికానే బురిడీ కొట్టించాడు. అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ కొద్దికాలం క్రితం భారత్ నుంచి పారిపోయిన ఈయన.. ఓ ఐలాండ్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దానికే 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస' అని పేరుపెట్టుకున్నాడు. ఇదే తన దేశమని ప్రకటించుకున్నాడు. ఇటీవల ఐక్యరాజ్య సమితిలో కైలాస ప్రతినిధులు పాల్గొని భారత్‌కు వ్యతిరేకంగా ప్రసంగించారు. వీరి ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే 'సిస్టర్ సిటీ' పేరుతో కైలాస దేశం అమెరికాలోని నెవార్క్ నగరంతో ఒప్పందం కుదుర్చుంది. జనవరి 12న ఇందుకు సంబంధించిన ఒప్పంద ప్రతులపై ఇరువురు సంతకాలు కూడా చేశారు. దీంతో పాటు వర్జీనియా, ఓహియో, ఫ్లోరిడా సహా అమెరికాలోని 30 నగరాలు కైలసతో సాంస్కృతిక ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు ఆ దేశం తెలిపింది. కానీ అసలు కైలాస అనే దేశమే లేదని తెలుసుకున్నాక అమెరికా నగరాలు నివ్వెరపోయాయి. దీంతో నెవార్క్ నగరం కైలాసతో ఒప్పందాలు రద్దు చేసుకుంది. కనీసం ఒక దేశం ఉందో లేదో కూడా తెలుసుకోకుండా ఇలా గుడ్డిగా ఒప్పందాలు కుదుర్చుకోవడం ఏంటని నెవార్క్ అధికారులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: పుతిన్‌పై ఐసీసీ అరెస్టు వారెంట్ -
హ్యాట్సాఫ్ .. మనోజ్ఞ
నెవార్క్ (న్యూజెర్సీ) : ఏదేశమేగిన ఎందుకాలిడినా పొగడరా నీ తల్లిభూమి భారతిని అన్నట్టుగా అమెరికా వెళ్లినా.. ఇండియా కోసం పరితపిస్తోంది వైద్య విద్యార్థి మనోజ్ఞ రూత్ ప్రసాద్. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన బీభత్సం చూసి చలించిపోయారు డాక్టర్ మనోజ్ఞ. దీంతో అమెరికాలో ఉంటూనే ఇండియాలో ఉన్న డాక్టర్లకు సాయం చేసేందుకు నిధులు సమీకరిస్తున్నారు. దీంతో పాటు కోవిడ్ పట్ల అవగాహన పెంచేందుకు అమెరికాలో పలు కార్యక్రమాలు మనోజ్ఞ చేపడుతున్నారు. కోవిడ్ సాయం న్యూ జెర్సీలోని నెవార్క్లో ఉన్న సెయింట్ మైఖేల్ మెడికల్ సెంటర్లో మనోజ్ఞ మెడికల్ రెసిడెంట్‌గా పని చేస్తోంది. ఇక్కడ ఉంటూనే ఇండియాలో ఉంటున్న వారి కోసం నిధుల సమీకరణ, అమెరికా ప్రజల్లో పట్ల కోవిడ్ అవగాహన పెంచే పనులు చేపడుతున్నారు. దీని కోసం గోఫండ్‌మీ ఫేజ్‌ను క్రియేట్ చేశారు. కాలేజీలో తనతో పాటు పని చేస్తున్న డాక్టర్లు , విద్యార్థులు, అధ్యాపకులను ఒప్పించారు. అంతా కలిసి మంగళవారం నెవార్క్లో ర్యాలీ నిర్వహించారు. హాస్పటిల్ నుంచి జేమ్స్ స్ట్రీట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ గోఫర్మీ ద్వారా ఇప్పటి వరకు 2,500 డాలర్ల నిధులు సేకరించగలిగారు. గోఫండ్‌మీ ‘గోఫండ్‌మీ పేజ్ ద్వారా మేము నిర్వహించిన ర్యాలీ వల్ల కోవిడ్ పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెరుగుతుంది. అంతేకాకుండా ఇతరులకు సహాయ పడేందుకు ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తుంది’ అని డాక్టర్ మనోజ్ఞ రూత్ ప్రభు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇండియాకు సాయం ఎంతో అవసరమని ఆమె అన్నారు. మెడికల్ లెర్నింగ్ ప్రాసెస్‌లో సోషల్ యాక్టివిజమ్ ఓ భాగమని ఇంటర్నల్ మెడిసిన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ థియోడర్ డికోస్టా అభిప్రాయపడ్డారు. చదవండి : రాష్ట్రాభివృద్ధికి ఎన్నారైల బాసట -
పొరపాటున వేరే విమానమెక్కి..
న్యూయార్క్: అమెరికాలో ఒక విమానయాన సంస్థ తప్పిదంతో ఒక మహిళ దాదాపు 4,800 కిలోమీటర్లు తప్పు మార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది. అమెరికాలోని నెవార్క్ నుంచి పారిస్ వెళ్లేందుకు ఏప్రిల్ 24న విమానమెక్కిన లూసీ చివరకు శాన్ఫ్రాన్సిస్కోలో దిగింది. అసలేం జరిగిందంటే.. చివరి నిమిషంలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ పారిస్ వెళ్లే విమానం బోర్డింగ్ గేట్‌ను మార్చింది. మైక్ ద్వారా ప్రకటించినా.. లూసీకి ఇంగ్లిషు రాకపోవడంతో ఆ విషయం తెలియలేదు. బోర్డింగ్ సిబ్బంది కూడా టికెట్‌ను సరిగా చూడకుండా స్టాంప్ వేయడంతో ఆమె శాన్ఫ్రాన్సిస్కో వెళ్లే విమానం ఎక్కేసింది. తన సీటులో ఎవరో కూర్చోవడంతో విషయాన్ని సిబ్బందికి తెలిపింది. వారు కూడా టికెట్‌ను సరిగా పరిశీలించకుండా వేరే సీటును కేటాయించారు. దీంతో ప్యారిస్ బదులు శాన్ఫ్రాన్సిస్కో చేరుకోవడంతో పాటు అక్కడ 11 గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చింది. చివరకు అధికారులు క్షమాపణ చెప్పి ఆమెను గమ్యస్థానానికి చేర్చారు. -
చుక్కలు చూపించిన విమానం!
న్యూయార్క్ః విమాన ప్రయాణం అంటేనే ఇటీవల వణుకు పుట్టే పరిస్థితి వస్తోంది. సాంకేతిక లోపాలు ఏర్పడటం, పక్షులు అడ్డు పడటం, ల్యాండింగ్ లో పొరపాట్లు జరగడం వంటి సంఘటనలు మామూలైపోయింది. తాజాగా న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై ల్యాండ్ అవ్వాల్సిన బోయింగ్ విమానం ఒక్క ఉదుటున ఎగిరి పడటంతో ప్రయాణీకులు అదిరి పడ్డారు. ప్రాణాలు గుప్పెట్టో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. న్యూయార్క్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వాల్సిన బోయింగ్ 767 ప్యాసింజర్ విమానం ప్రయాణీకులకు చుక్కలు చూపించింది. ల్యాండ్ అయ్యే ముందు పైలట్ మనసు మార్చుకోవడంతో రన్ వే పై బౌన్స్ కొట్టి, తిరిగి టేకాఫ్ అయ్యింది. పైలట్ రఫ్ రైడింగ్ తో విమానంలోని ప్యానెల్స్, మెకానికల్ బాక్స్ లు ఇతర చిన్న చిన్న వస్తువులు ప్రయాణీకులపై పడ్డాయి. హోస్టన్ నుంచి 214 మంది ప్రయాణీకులతో బయల్దేరిన 557 విమానం ల్యాండింగ్ విషయంలో ఏర్పడ్డ అస్థవ్యస్థ స్థితికి ప్రయాణీకులు వణికిపోయారు. ల్యాండ్ అయ్యేందుకు రన్ వే పైకి వచ్చిన విమానం స్కిప్ అవ్వడంతో పైలట్ తిరిగి టేకాఫ్ చేశాడని, తిరిగి ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించగా విమానం తిప్పలు పెట్టడంతో మరోసారి టేకాఫ్ చేశాడని ఇలా పలుమార్లు ల్యాండింగ్ కు ప్రయత్నించడం, టేకాఫ్ అవ్వడం ప్రయాణీకులను తీవ్ర ఆందోళనకు గురి చేసిందని ఓ ప్రత్యక్ష సాక్షి... ప్రయాణీకుడు తెలిపాడు. చివరిసారి ల్యాండ్ అయ్యేందుకు ముందు ఆకాశంలో పైటట్ కనీసం 30 సార్లు చక్కర్లు కొట్టించినట్లు తెలిపిన ప్రయాణీకుడు.. ఎట్టకేలకు ల్యాండ్ చేయడంతో ప్రయాణీకుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసినట్లు చెప్పాడు. అయితే విమానం చివరికి సేఫ్ గా ల్యాండ్ అయ్యిందని, ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు తగల్లేదని ఎయిర్ లైన్స్ వెల్లడించింది. అయితే అంతటి సందిగ్ధావస్థలోనూ ఓ వ్యక్తి వీడియోను తీసి సిబ్బందికి అందించడం విశేషం. -
ముంబై టు న్యూయార్క్
- విమానంలో కరెన్సీ అక్రమ తరలింపు - న్యూయార్క్ ఎయిర్ పోర్టులో అడ్డంగా దొరికిపోయిన పైలట్ ఆకాశమార్గంలో నగదు అక్రమ తరలింపునకు పాల్పడ్డ పైలట్ ఉదంతం అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. నిందితుడి దగ్గర లభించిన అక్రమ కరెన్సీ ముంబై నుంచి సరఫరా కావటంతో ఇటు భారతీయ అధికారులూ కలవరపాటుకు గురయ్యారు. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. టెక్సాస్ కు చెందిన ఆంటోనీ వార్నర్ (55) ఓ కమర్షియల్ పైలట్. వేరొక మిమానంలో ముంబై నుంచి న్యూయార్క్ కు భారీగా అక్రమ డాలర్లు తరలిస్తున్న ఆయనను లిబర్టీ ఇంజర్నేషనల్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ల్యాప్ టాప్ బ్యాగులో దాచిన రెండు లక్షల యూఎస్ డాలర్లతోపాటు భారీగా ఆభరణాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత డబ్బు, నగలపై వార్నర్ వివరణ అనుమానాస్సదంగా అనిపించడంతో అతణ్ని అరెస్టుచేశామని ఇమిగ్రేషన్ అధికారుల చెప్పారు. కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ సైతం దర్యాప్తులో పాలుపంచుకుంటున్న ఈ కేసులో నేరణం నిరూపణ అయితే వార్నర్ కు గరిష్టంగా ఐదేళ్లు జైలు శిక్షపడే అవకాశం ఉంది. అయితే ముంబై నుంచి న్యూయార్క్ కు వార్నర్ ప్రయాణించిన విమానం ఏ సంస్థకు చెందిందో తెలిపేందుకు నిరాకరించారు అధికారులు! -
ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెనుప్రమాదం
న్యూఢిల్లీ: ముంబయికి చెందిన ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. దానిని అత్యవసరంగా దించివేశారు. ఇంజిన్‌లో తీవ్ర సమస్య తలెత్తిందని పైలెట్ గుర్తించడంతో ముందస్తుగా వెనక్కి రప్పించి దిప్పడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 777-300 అమెరికా కాలమానం ప్రకారం 4.30గంటలకు అమెరికాలోని నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంనుంచి ముంబయికి బయలుదేరింది. సరిగ్గా 29,000 అడుగుల ఎత్తులో ఉండగా విమానం మొత్తం కంపించడం ప్రారంభించడంతో అప్రమత్తమైన పైలెట్ సంబంధిత అధికారులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే దించేయాల్సిందిగా అధికారులు చెప్పడంతో చాకచక్యంతో వ్యవహరించిన పైలెట్ విమానాన్ని సురక్షితంగా తిరిగి నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే దించేశాడు. ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. అందులోని ప్రయాణీకులను ఢిల్లీకి చెందిన మరో విమానం ద్వారా తరలించారు. దించిన అనంతరం తనిఖీ చేయగా విమానం ఇంజిన్‌లోని ఓ బ్లేడ్ విరిగిపోయినట్లు గుర్తించారు. -
విమానంలో ఓ ముద్దు... జైలు పాలు చేసింది !
న్యూయార్క్: ఆయన వయస్సు 62 ఏళ్లు... విమానంలో ప్రయాణిస్తూ... తన పక్కనే కూర్చుని నిద్రిస్తున్న మహిళకు ముద్దు పెట్టేశాడు. అక్కడితో ఆగకుండా... ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. దాంతో వెంటే నిద్ర నుంచి మొల్కొన్న సదరు మహిళ భయపడిపోయింది. వెంటనే ఆమె విమానంలోని సిబ్బంది వద్దకు వెళ్లి తోటి ప్రయాణికుడిపై ఫిర్యాదు చేసింది. దాంతో విమానం ఎయిర్పోర్ట్ చేరగానే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఘటన అమెరికాలో హ్యూస్టన్ నుంచి నెవార్క్‌కు యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో వెళ్తుండగా చోటు చేసుకుంది. నిందితుడి ఎన్నారై దేవేందర్ సింగ్‌గా గుర్తించామని... అతడి స్వస్థలం ల్యూసియానా అని చెప్పారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో దేవేందర్ సింగ్‌కు రెండేళ్ల జైలు శిక్షతోపాటు 250,000 అమెరికన్ డాలర్లు జరిమానా విధించే అవకాశం ఉందని వెల్లడించారు. నిందితుడు దేవేందర్ సింగ్‌ను కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు
నెవార్క్(అమెరికా): ఎయిర్ ఇండియా విమానానికి అమెరికాలో ప్రమాదం తప్పింది. ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే పక్షి ఢీకొనడంతో విమానం ఎడమ ఇంజిన్ పాడైంది. దీంతో విమానాన్ని వెనక్కు తీసుకొచ్చి సురక్షితంగా కిందకు దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 313 మంది ప్రయాణికులతో న్యూజెర్సీలోని నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతం(స్థానిక సమయం) బయలుదేరిన ముంబై విమానం ఏఐ-114ను పక్షి ఢీకొట్టడంతో ఎడమ ఇంజిన్ పాడైందని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. దీంతో అరగంట తర్వాత విమానాన్ని వెనక్కు తీసుకొచ్చినట్టు చెప్పారు. విమానంలోని వారందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఇంజిన్ లో తలెత్తిన లోపాన్ని సరిచేసేందుకు ఢిల్లీ నుంచి నిపుణులు వస్తున్నారని వెల్లడించారు. ప్రయాణికులను పంపించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.