
కుక్కకు రూ. 6 కోట్ల సంపద!
కోటీశ్వరుల జాబితాలో ఓ కుక్క కూడా చేరింది.
కోటీశ్వరుల జాబితాలో ఓ కుక్క కూడా చేరింది. అమెరికాలో ఓ పెంపుడు కుక్కకు దాదాపు 6 కోట్ల పైచిలుకు విలువ చేసే ఆస్తి దక్కింది. డబ్బుతో పాటు పెద్ద భవంతి, బంగారు నగలు కూడా కానుకగా ఇచ్చారు. కుక్క యజమానురాలు ఈ మేరకు వీలునామా రాయించారు.
న్యూయార్క్కు చెందిన రోజ్ ఆన్ బొలస్నీ అనే 60 ఏళ్ల మహిళ పెంపుడు కుక్క 'బెల్ల మియా'కు ఈ సంపదను కానుకగా ఇచ్చారు. గతేడాది ఏప్రిల్లో కొనుగోలు చేసిన ఇంటిని కుక్కకు బహుమతిగా అందజేశారు. ఇప్పటిలాగే తన అనంతరం కూడా కుక్కు విలాసవంతమైన జీవితం గడిపేందుకోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు రోజ్ తెలిపారు. ఇందుకు ఆమె ఇద్దరు కుమారులు కూడా అభ్యంతరం పెట్టకపోవడం విశేషం. అంతేగాక తల్లి తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలికారు. తన కుమారులకు బెల్లా కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని, బాగా సంపాదిస్తున్నారని, వారికి తన డబ్బు అవసరం లేదని రోజ్ చెప్పారు. ఇక కుక్క ఫ్యాషన్ షోలో కూడా అదరగొడుతోంది. 2013, 2014 బెల్లా వరుసగా న్యూయార్క్ పెట్ ఫ్యాషన్ షోలో విజేతగా నిలిచింది. వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచింది బెల్లానే కావడం విశేషం. బెల్లా తన జాతి కుక్కల్లో స్టార్లా వెలిగిపోతోంది. మంచి డ్రెస్సులు కూడా ఉన్నాయి.