
విమానాశ్రయాల్లో చోటు చేసుకునే కొన్ని వింత ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఓ వ్యక్తి చేసిన పని వినడానికే రోత పుడుతోంది. వివరాలు.. ఎయిర్‌పోర్టులోని టెర్మినల్‌లో ప్రయాణికులతోపాటు ఓ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అకస్మాత్తుగా ఆయన అందరిముందే మూత్ర విసర్జన చేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఛీ అంటూ చుట్టుపక్కల వాళ్లు వికారంగా మొహం పెట్టారు. వాళ్లేంటి.. ఈ విషయం తెలిసిన ఎవరైనా ఛీ.. యాక్ అనుకోకుండా ఉండరు. అయితే దీనికి సంబంధించిన వీడియోను ఓ ప్రయాణికుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది.
ఈ వీడియోను ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా వీక్షించారు. చాలామంది నెటిజన్లు అతను చేసిన వికారమైన చర్యకు బుద్ధిచెప్పాలని, అందుకోసం అతన్ని అరెస్ట్ చేయాలని కోరారు. మరికొంతమంది అతను చేసిన పనికి చీదరించుకున్నారు. ఓ నెటిజన్ మాత్రం ‘మీ సోదాపండి. అతన్ని కాస్త రిలాక్స్ కానివ్వండి’ అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. అతను చేసిన పనికి ఎయిర్‌పోర్ట్ అధికారులు ఊరికే వదిలిపెట్టరు కానీ జనాలు మాత్రం ఇప్పుడీ వీడియో చూసి నవ్వుకోవాలో లేదా అతన్ని తిట్టుకోవాలో తెలియని అయోమయంలో పడ్డారు.
చదవండి: 21 ఏళ్లకే ఎంతటి సాహసం!
Comments
Please login to add a commentAdd a comment