Airport Terminal
-
ఎయిర్‌పోర్ట్‌లో ఓ వ్యక్తి చేసిన పని వినడానికే రోత
-
ఛీ, యాక్.. అందరి ముందే పోసేశాడు
విమానాశ్రయాల్లో చోటు చేసుకునే కొన్ని వింత ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఓ వ్యక్తి చేసిన పని వినడానికే రోత పుడుతోంది. వివరాలు.. ఎయిర్‌పోర్టులోని టెర్మినల్‌లో ప్రయాణికులతోపాటు ఓ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అకస్మాత్తుగా ఆయన అందరిముందే మూత్ర విసర్జన చేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఛీ అంటూ చుట్టుపక్కల వాళ్లు వికారంగా మొహం పెట్టారు. వాళ్లేంటి.. ఈ విషయం తెలిసిన ఎవరైనా ఛీ.. యాక్ అనుకోకుండా ఉండరు. అయితే దీనికి సంబంధించిన వీడియోను ఓ ప్రయాణికుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా వీక్షించారు. చాలామంది నెటిజన్లు అతను చేసిన వికారమైన చర్యకు బుద్ధిచెప్పాలని, అందుకోసం అతన్ని అరెస్ట్ చేయాలని కోరారు. మరికొంతమంది అతను చేసిన పనికి చీదరించుకున్నారు. ఓ నెటిజన్ మాత్రం ‘మీ సోదాపండి. అతన్ని కాస్త రిలాక్స్ కానివ్వండి’ అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. అతను చేసిన పనికి ఎయిర్పోర్ట్ అధికారులు ఊరికే వదిలిపెట్టరు కానీ జనాలు మాత్రం ఇప్పుడీ వీడియో చూసి నవ్వుకోవాలో లేదా అతన్ని తిట్టుకోవాలో తెలియని అయోమయంలో పడ్డారు. చదవండి: 21 ఏళ్లకే ఎంతటి సాహసం! ఎంత కాలం ‘సింగిల్’గా ఉంటావ్.. -
విమానాశ్రయంలో మరిన్ని వసతులు
పెరిగిన అవసరాల కనుగుణంగా టెర్మినల్ భవనం మార్చాలి ఎయిర్‌పోర్టు అభివృద్ధిపై సమీక్షలో కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు గన్నవరం : పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనాన్ని మార్చాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు అధికారులను ఆదేశించారు. విజయవాడను రాజధానిగా ఎంపిక చేసిన నేపథ్యంలో ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. గన్నవరం విమానాశ్రయ అభివృద్ధిపై చర్చించేందుకు ఆయన లాంజ్రూములో గురువారం ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు, జీవీకే సంస్థ ప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. సుమారు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో ఎయిర్‌పోర్టు విస్తరణ కోసం అధికారులు రూపొందించిన మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదనలను పరిశీలించడంతో పాటు పలు అంశాలపై చర్చించారు. పెరిగిన విమాన సర్వీసులకు అనుగుణంగా ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనంలో ప్రయాణికులు కూర్చునేందుకు సదుపాయాలు లేవని అశోక్‌గజపతిరాజు పేర్కొన్నారు. భద్రత కూడా సరిగా లేదన్నారు. ఇంటర్ భవనం ప్లాన్ పరిశీలన ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు గాను తాత్కాలిక టెర్మినల్ కోసం సుమారు రూ.105 కోట్లతో జీవీకే సంస్థ నిర్మించనున్న ఇంటర్ భవనం ప్లాన్‌ను ఆ సంస్థ ప్రతినిధులు అశ్విన్ తొరట్, చంద్రభాన్ మన్వానీ కేంద్ర మంత్రికి వివరించారు. ఈ భవనంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటుచేయనున్న వసతుల గురించి తెలియజేశారు. ఈ భవనం నిర్మించడం వల్ల సమీపంలో ఉన్న రాడార్ (డీవీవోఆర్) కేంద్రం ద్వారా ఎయిర్‌క్రాఫ్ట్‌లకు అందాల్సిన సిగ్నల్స్ వ్యవస్థకు ఆటంకం ఏర్పడుతుందని, ఆ కేంద్రాన్ని మరోచోటకు తరలించేందుకు అత్యవసరంగా కొంత ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉందని చెప్పారు. భూసేకరణ పూర్తయి, భవిష్యత్తులో శాశ్వత టెర్మినల్‌ను నిర్మించిన తర్వాత ఈ ఇంటర్ భవనాన్ని కార్గో సర్వీసుల కోసం వినియోగించుకోవచ్చని తెలిపారు. ఇంటర్ భవన నిర్మాణానికి ఏడాదిన్నర పడుతుందని మంత్రికి వివరించారు. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న టెర్మినల్‌ను 200 నుంచి 300 మంది ప్రయాణికులు కూర్చునేందుకు అనువుగా, ఆకర్షణీయంగా రెండు, మూడు నెలల్లో మార్పులు, చేర్పులు చేయాలని అధికారులకు కేంద్ర మంత్రి సూచించారు. ఇందుకోసం ఏవియేషన్ రంగంలో అనుభవం ఉన్న జీవీకే సంస్థ ప్రతినిధుల సలహాలు తీసుకోవాలని చెప్పారు. హుద్‌హుద్ తుపాను ధాటికి విశాఖపట్నం విమానాశ్రయం దెబ్బతిన్నప్పటికీ ఐదు రోజుల్లో పునరుద్ధరణ పనులు పూర్తిచేసి యథాస్థితికి తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. మరో 220 ఎకరాల భూమి కావాలి అన్ని రకాల విమానాలూ దిగేందుకు వీలుగా రన్‌వేను 14,500 అడుగులకు విస్తరించాల్సి ఉందని ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకోసం గతంలో భూసేకరణ నిమిత్తం నోటీసులు జారీచేసిన 450 ఎకరాలతో పాటు మరో 220 ఎకరాలు సేకరించాల్సి ఉందని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్‌ఈడీ ఎస్‌హెచ్ సురేష్, ఎయిర్‌పోర్టు డెరైక్టర్ రాజ్‌కిషోర్, ఎంపీలు కేశినేని నాని, గోకరాజు గంగారాజు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, కలెక్టర్ బాబు.ఎ తదితరులు పాల్గొన్నారు. రైతులకు నష్టం లేకుండా భూసేకరణ : ఎమ్మెల్యే వంశీ రైతులకు నష్టం లేకుండా విమానాశ్రయ భూసేకరణను ప్రభుత్వం చేపడుతుందని ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ చెప్పారు. విమానాశ్రయంలో కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజును కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ప్రభుత్వం 440 ఎకరాలను రైతుల నుంచి సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. రన్‌వేను పూర్తిస్థాయిలో విస్తరించేందుకుగాను ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు మరో 220 ఎకరాలు కావాలని ప్రభుత్వానికి నివేదిక పంపించారని తెలిపారు. విమానాశ్రయ అభివృద్ధికి అవసరమైన భూములను రైతులందరి ఆమోదం మేరకు సేకరించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. మెరుగైన ప్యాకేజీ, భూసమీకరణ పద్ధతుల్లో రైతులను సంతృప్తి పరిచే విధంగా ప్రభుత్వం సేకరిస్తుందని తెలిపారు. ఈ నెల 13న కలెక్టర్ బాబు.ఎ ఆధ్వర్యంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
నగర రూపురేఖలు మారుస్తా..
బెజవాడ బ్యూటిఫికేషన్‌కు రూ.15కోట్లు కళాక్షేత్రం అభివృద్ధికి రూ.4కోట్లు డీఆర్ఆర్ ఇండోర్ స్టేడియానికి రూ.1.5 కోట్లు ఎయిర్‌పోర్టు టెర్మినల్ ఆధునికీకరణకు రూ.50కోట్లు కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై విచారణ విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు విజయవాడ : రాజధాని విజయవాడ నగరం చెత్తాచెదారంతో నిండిపోయిందని, తాను ఐదారుసార్లు పర్యటించి పూర్తిగా పక్షాళన చేసి రూపురేఖలు మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ప్రకటించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం సీఎం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఇరిగేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడారు. సిటీ బ్యూటిఫికేషన్ కోసం వివిధ శాఖ అధికారులతో కమిటీ వేస్తామని చెప్పారు. నగరాన్ని బ్యూటిఫికేషన్ చేసేందుకు రూ.15 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పేపరు, ప్లాస్టిక్, మెటల్ వంటి వ్యర్థ పదార్థాలను వేరుచేసి ప్రక్షాళన చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించినట్లు సీఎం వివరించారు. కాల్వగట్లను అభివృద్ధి చేస్తామని, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ రూ.1,500 కోట్లతో జలరవాణాను ప్రారంభిస్తుందని తెలిపారు. ఐదు ఎకరాల్లో నాలుగు వేల ఇళ్లను నిర్మించి నగరంలోని మూడు కాల్వల గట్లపై ఉన్న వారిని తరలిస్తామని చెప్పారు. ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లై ఓవర్ ప్రతిపాదనలు కేంద్రానికి పంపాం ఇంద్రకీలాద్రి వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఫ్లై ఓవర్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపామని, కేంద్రం నిధులు మంజూరు కాగానే అభివృద్ధిపనులు ప్రారంభిస్తామని సీఎం చెప్పారు. రామలింగేశ్వరనగర్లో రెండు లక్షల మంది కలుషిత నీరు తాగుతున్నారని, వారికి మంచినీరు అందించేందుకు రూ.52కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. నగరంలోని దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం అభివృద్ధికి రూ1.5 కోట్లు, తుమ్మలపల్లి కళాక్షేత్రానికి రూ.4కోట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నాలుగు రోడ్ల విధానం అమలుచేస్తామని తెలిపారు. గన్నవరం ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. టెర్మినల్ బిల్డింగ్ ఆధునికీకరణకు రూ.50 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. నిధుల దుర్వినియోగంపై విచారణ నగరపాలక సంస్థ పరిధిలో వివిధ పథకాల అమలు కోసం రూ.350 కోట్లు అప్పు తెచ్చారని, ఈ నిధులతో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించకుండా బీఆర్టీఎస్ వంటి రోడ్లు నిర్మించారని సీఎం పేర్కొన్నారు.దీనివల్ల కార్పొరేషన్ ప్రతి నెల రూ.3 కోట్లు వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. నిధుల దుర్వినియోగంపై విచారణ చేయిస్తామన్నారు. అధికారుల గుండెల్లో నిద్రపోయా : సీఎం అధికారుల సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 100 సార్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అధికారుల గుండెల్లో నిద్రపోయానని తెలిపారు. సమాజంలో మార్పు తీసుకురావడం కోసం అధికారుల్ని పరుగులు పెట్టించేవాడినని, బహిరంగంగా నిలదీసేవాడినని చెప్పారు. ప్రస్తుతం తన విధానం మార్చుకున్నానని, అందరూ కలిసి రావాలని, కష్టించేతత్వం గల అధికారుల్ని స్వాగతిస్తానని, పనిచేయని వారిని విడిచిపెట్టే ప్రశ్నే లేదన్నారు. ఇక నుంచి ప్రతి వారం ఆకస్మిక తనిఖీలు చేస్తానని, పనితీరు బాగుంటే పిలిచి కాఫీ ఇస్తానని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని సీఎం హెచ్చరించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్, పి.నారాయణ, ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా, శ్రావన్‌కుమార్, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, మేయర్ కోనేరు శ్రీధర్, జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావు, జాయింట్ కలెక్టర్ జె.మురళి, సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సి.హరికిరణ్, డెప్యూటీ మేయర్ గోగుల రమణ, తదితరులు పాల్గొన్నారు. -
ఆదుకోండి ప్లీజ్
సాక్షి, విశాఖపట్నం: ‘హుదూద్ తుఫాన్ వల్ల ఉత్తరాంధ్ర అతలాకుతలమైంది. నాలుగు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. తీరం దాటిన చోటైన విశాఖ నగరం అతలాకుతలమైంది. విద్యుత్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. అన్ని రంగాలకు అపార నష్టం జరిగింది. ముందస్తు చర్యలు తీసుకోవడం వలన ప్రాణ నష్టాన్ని నివారించగలిగాం.. రాష్ర్ట యంత్రాంగమంతా స మిష్టిగా కృషి చేయడం వల్ల కేవలం మూడు రోజుల వ్యవధిలోనే వ్యవస్థలన్నీ పునరుద్ధరించగలిగాం. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ లోటుబడ్జెట్లో ఉంది..జరిగిన నష్టానికి పరిహారం ఇచ్చేందుకు కానీ..నగరం పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు కానీ కేంద్రమే ఉదారంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది’ అని కేంద్ర బృందానికి హుదూద్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్రం నుంచి భారీ ప్యాకేజీ ఇచ్చే విధంగా చూడాలని కోరారు. హుదూద్ తుఫాన్ నష్టాలపై అంచనా వేసేందుకు కేంద్రం నియమించిన ప్రత్యేక ఉన్నతస్థాయి అధికారుల బృందం ఉత్తరాంధ్ర పర్యటనకు శ్రీకారం చుట్టింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఈ బృందం తొలుత ఎయిర్పోర్టుకుజరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఎయిర్‌పోర్టు అథారిటీ డెరైక్టర్ పట్టాభి ఎయిర్‌పోర్టు టెర్మినల్ తుఫాన్ వల్ల ఏ విధంగా దెబ్బతిన్నదో వివరించారు. నాటి విధ్వంస దృశ్యాలను బృందం పరిశీలించింది. అనంతరం నేరుగా కలెక్టరేట్‌కు చేరుకుని తుఫాన్ నష్టాలపై ఏర్పాటు చేసిన ఫోటోఎగ్జిబిషన్ను తిలకించారు. కలెక్టరేట్లో తుఫాన్ నష్టాలపై ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వారికి వివరించారు. ఈసందర్భంగా తుఫాన్‌కు ముందు తీసుకున్న చర్యలు..ఆ తర్వాత చేపట్టిన సహాయ, పునరావాస చర్యల కోసం లోతైన పరిశీలన చేశారు. వారం రోజుల్లోనే పునరుద్దరించగలిగాం జిల్లా కలక్టర్ యువరాజ్ మాట్లాడుతూ వల్ల రూ.65వేల కోట్లకు పైగా నష్టంవాటిల్లిందని రూ.21వేల కోట్ల సాయమైనా అందించకపోతే కోలుకోవడం కష్టమని వివరించారు. పారిశ్రామికంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. రైతులను ఆదుకునేందుకు తక్షణ సాయంకింద రూ.4వేల కోట్లు ఇవ్వాలనికోరారు. ఇంత పెద్ద విపత్తుసమయంలో అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకున్నచర్యలు వివరించాలని కేంద్రబృందం సభ్యులు కోరగా, తుఫాన్ అనంతరం భారీ వర్షాలు కురవకపోవడంతో పాటు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించడం వలన అంటు వ్యాధుల వ్యాప్తిని అరికట్టగలిగామని కలెక్టర్లు వివరించారు. వారం రోజుల్లోనే విద్యుత్‌ను పునరుద్దరించగలిగామని ఏపీఈపీడీసీఎల్ సీఎండి శేషగిరిబాబు వివరించారు. తుఫాన్ వల్ల ఎక్కువగా నష్టపోయింది జీవీఎంసీయేనని..90వేల విద్యుత్ దీపాలు, లక్షలాది చెట్లు ధ్వంసమవడంతో పాటు మంచినీటి వనరులు కూడా దెబ్బతిన్నాయని జీవీఎంసీ కమిషనర్ జా నకీ వివరించారు. 2.20లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, ఉత్తరాంధ్రలో ఉన్నవారంతా సన్న,చిన్నకారు రైతులేనని, వార్ని వెంటనే ఆదుకోకపోతే కోలుకోలేరని వ్యవసాయశాఖ కమిషనర్ మదుసూదన రావు అన్నారు. తమ జిల్లాల్లో జరిగి న నష్టాలను విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లా కలెక్ట ర్లు ఎంఎం నాయక్, సౌరబ్‌గౌర్, నీతూకుమారి ప్రసాద్‌లు వివరించా రు. రాష్ర్ట ప్రభుత్వం తరపున సమర్పించిన నివేదిక పట్ల బృందం సభ్యు లు అసంతృప్తి వ్యక్తం చేశారు. పునరుద్దరణకు ఎంతఖర్చు పెట్టారు. ఆ నిధులనుఏ విధంగా సమీకరించారో చెప్పాలని సూచించా రు. దీనిపై కలెక్టర్లు సమాధానం చెప్పకపోవడంతో మూడురోజుల్లో సమగ్రనివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
ఎయిర్పోర్ట్ టెర్మినల్ పేరు మార్పుచేస్తే సహించం సోమాజీగూడ వద్ద జరిగిన ధర్నాలో కాంగ్రెస్ నేతల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పేరును పెడుతూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. విమానాశ్రయంలోని అంతర్జాతీయ, దేశీయ టెర్మినళ్లకూ మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ పేరునే కొనసాగించాలని కోరారు. ఎన్టీఆర్‌పై ప్రేమ ఒలకబోస్తున్న వారంతా.. ఆయన్ను చెప్పులతో కొట్టించినప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు కుట్రచేసి ఈ నిర్ణయం తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా సోమవారం (24న) అన్ని జిల్లాల్లో ధర్నా కార్యక్రమాలను చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. శనివారం సోమాజిగూడలోని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో పార్టీ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, కె.జానారెడ్డి, డి.శ్రీనివాస్, మహ్మద్ అలీ షబ్బీర్, వి.హనుమంతరావు, దానం నాగేందర్, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, అంజన్‌కుమార్‌యాదవ్, శ్రీశైలం గౌడ్, భిక్షపతియాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వారు ఆ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం సైతం చేసిన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని ఇలా అవమానించడాన్ని ఖండిస్తున్నామన్నారు. -
విమానాశ్రయం.. అదుర్స్
ఎయిర్పోర్ట్ టెర్మినల్ అదుర్స్ కదూ.. చైనాలోని గువాంగ్‌డాంగ్‌లో ఇటీవల ప్రారంభమైన షెంజెన్బావో అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ ఇది. టేకు చేప ఆకారంలో దీన్ని కట్టారు. టెర్మినల్ పైకప్పు తేనెపట్టు డిజైన్‌ను తలపిస్తుంది. పైన అద్దాలను అమర్చడం వల్ల టెర్మినల్ లోపలి భాగానికి సూర్యకాంతి ధారాళంగా వెళ్తుంది. దీని వల్ల విద్యుత్ ఆదా అవుతుంది. అంతేకాదు.. వర్షపు నీటిని నిల్వ చేసి.. దాన్ని రీసైకిల్ చేసి.. బాత్రూంలకు, మొక్కలకు వాడతారు. ఇందులో 10 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ కూడా ఉంది. అంతేనా.. ఇంటీరియర్ డిజైన్‌కు తగ్గట్లు ఏసీలు కూడా తెల్లటి చెట్టు మోడు ఆకారంలో ఉంటాయి. ఇంతకీ దీన్ని కట్టడానికి ఎంత అయిందో తెలుసా? రూ.8,700 కోట్లు.