
పాకిస్తాన్ ప్రధాని షాహిద్ అబ్బాసీ
ఇస్లామాబాద్: అమెరికా ఎయిర్‌పోర్ట్‌లో పాకిస్తాన్ ప్రధాని షాహిద్ అబ్బాసీ భద్రతా తనిఖీలు ఎదుర్కొన్నారనే వార్తలు పాక్, అమెరికా సంబంధాలను మరింత దెబ్బతీసేలా ఉన్నాయి. తమ ప్రధాని పట్ల అమర్యాదకరంగా వ్యవహరించారని అమెరికాపై పాక్ మండిపడుతోంది. పాక్ జాతీయులపై ట్రంప్ యంత్రాంగం చేపట్టిన వీసా బ్యాన్ నియంత్రణలను ఈ సందర్భంగా ఉటంకిస్తున్నారు. అయితే పాకిస్తాన్ ప్రధాని స్వచ్ఛందంగా భద్రతా ప్రమాణాలను అనుసరించారని పాక్‌కు చెందిన జియో న్యూస్ పేర్కొంది.
అబ్బాసీ అమెరికాలో ప్రైవేట్ పర్యటనలో ఉన్నారని పేర్కొంటూ పాక్ ప్రధాని సెక్యూరిటీ ప్రొటోకాల్ లేకుండా ఎయిర్‌పోర్ట్‌లో కనిపిస్తున్న వీడియోను జియో న్యూస్ విడుదల చేసింది. వ్యక్తిగత జీవితంలో అబ్బాసీ ఎంత నిరాడంబరంగా ఉంటారనేందుకు ఇది నిదర్శనమని తెలిపింది. ఇటీవల బ్రిటన్ పర్యటనలోనూ ఆయన రైలులో ఒంటరిగా ప్రయాణించారని గుర్తు చేసింది. పుట్టినరోజు వేడుకల్లోనూ శాలువా ధరించి బర్త్‌డే కేక్‌ను కట్‌చేస్తున్న ఆయన ఫోటోను జియో న్యూస్ ప్రదర్శించింది.
Comments
Please login to add a commentAdd a comment