
ఇస్లామాబాద్: పాకిస్తాన్ గగనతలం మీదుగా ప్రధాని నరేంద్రమోదీ విమానం వెళ్లడానికి అనుమతివ్వడంటూ భారత అధికారుల చేసిన విజ్ఞప్తిని పాక్ నిరాకరించింది. సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు మోదీ అమెరికా పర్యటనకు వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే మోదీ ప్రయాణించే ప్రత్యేక విమానం పాక్ గగనతలం మీదుగా వెళ్లాల్సి ఉంది. దీని కోరకు ముందుస్తుగా భారత అధికారులు పాక్ అనుమతి కోరారు. దీనిపై స్పందించిన పాక్ మోదీ విమానానికి అనుమతి ఇవ్వమని స్పష్టం చేసింది. కాగా ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విమానానికి కూడా పాక్ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితుల అనంతరం పాక్-భారత్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షిణించాయి. దీనిలో భాగంగానే గగనతల మార్గాల నుంచి భారత్ సర్వీసులను పాక్ నిషేధించింది. ఈ విషయాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్వయంగా తెలిపినట్లు పాక్ అధికారులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment