వాతావరణం వల్లే ఎయిర్ ఏషియా విమాన ప్రమాదం | Weather believed to be factor in AirAsia crash: Indonesia | Sakshi
Sakshi News home page

వాతావరణం వల్లే ఎయిర్ ఏషియా విమాన ప్రమాదం

Published Sun, Jan 4 2015 9:06 AM | Last Updated on Sat, Sep 2 2017 7:13 PM

వాతావరణం వల్లే ఎయిర్ ఏషియా విమాన ప్రమాదం

వాతావరణం వల్లే ఎయిర్ ఏషియా విమాన ప్రమాదం

జకర్తా: ఎయిర్ ఏషియా విమాన ప్రమాదానికి ప్రతికూల వాతావరణం ముఖ్య కారణమని ఇండోనేసియా వాతావరణ సంస్థ తెలియజేసింది. ప్రమాదం జరగడానికి ముందు పైలట్ నుంచి సమాచారాన్ని విశ్లేషించి నిర్ధారణకు వచ్చింది.

ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న విమానం జావా సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. విమానంలో ఉన్న 162 మంది మరణించారని భావిస్తున్నారు. కొన్ని మృతదేహాలను వెలికితీయగా, మిగిలినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల విమానం ఇంజిన్ చెడిపోయిఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రమాదం జరగడానికి ఇదీ ఒక కారణమని, అయితే విమానం కూలిపోవడానికి కచ్చితమైన కారణమేంటన్నది తేలాల్సివుందని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement