ఈ ఏడాది బెస్ట్,వరస్ట్ ఎయిర్ పోర్టులు..
విమానాశ్రయాల్లో విశ్రాంతి తీసుకోవడానికి అనువైన వాటిలో ఉత్తమ, చెత్త ఎయిర్ పోర్టుల జాబితాను 'గైడ్ టూ స్లీపింగ్ ఇన్ ఎయిర్ పోర్ట్స్' విడుదల చేసింది. విమానాశ్రయాల్లో ఎక్కువ సమయం వేచి ఉండే సందర్బాల్లో ప్రయాణికుల నుంచి తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా ఈ జాబితాను తయారు చేశారు. నిద్ర పోవడానికి అనువైన, బెస్ట్ ఇన్ లే ఓవర్స్(విమానం మారాల్సి వచ్చినప్పుడు వేచి ఉండే సమయం), మిగతా సౌకర్యాల విషయంలో తీసుకునే జాగ్రత్తలను పరిశీలించి ఈ జాబితాను రూపొందించారు.
బెస్ట్ ఎయిర్ పోర్టులు:
1)చాంగి అంతర్జాతీయ విమానాశ్రయం(సింగపూర్)
ప్రయాణికులకు బోర్ కొట్టకుండా మాసాజ్ చైర్స్, బట్టర్ ఫ్లై గార్డెన్, స్విమ్మింగ్ పూల్, సినిమా థియేటర్లు ఈ ఎయిర్ పోర్టు ప్రత్యేకత. అంతేకాకుండా 40 మీటర్ల ఎత్తులో నీరు ధారలా(ఫౌంటేయిన్) వచ్చేలా జువెల్ అనే కొత్త నిర్మాణాన్ని చేపట్టారు. ఇది 2018 వరకు పూర్తి కానుంది.
2)ఇచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం(సియోల్, దక్షిణ కొరియా)
3) హనెడా అంతర్జాతీయ విమానాశ్రయం( టోక్యో, జపాన్)
4) థావోయువాన్ అంతర్జాతీయ విమానాశ్రయం(థైపీ, థైవాన్)
5)మ్యూనిచ్ అంతర్జాతీయ విమానాశ్రయం(జర్మనీ)
6) కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం(ఒసాకా, జపాన్)
7) వాంకోవర్ అంతర్జాతీయ విమానాశ్రయం(వాంకోవర్, కెనడా)
8)హెల్సింకీ అంతర్జాతీయ విమానాశ్రయం(వాంటా, ఫిన్ల్యాండ్)
9)తల్లిన్ అంతర్జాతీయ విమానాశ్రయం(తల్లిన్, ఈస్టోనియా)
10)క్లోటెన్ అంతర్జాతీయ విమానాశ్రయం(జ్యూరిచ్, స్విడ్జర్ల్యాండ్)
చెత్త ఎయిర్ పోర్టులు:
1) కింగ్ అబ్దుల్లాజిజ్ అంతర్జాతీయ విమానాశ్రయం(జెడ్డా, సౌదీ అరేబియా)
ఎన్నో అంచనాలు ఉన్న జెడ్డా విమానాశ్రయంలో శుభ్రత లోపించడం, ప్రయాణికుల సౌకర్యాల కొరతతో చెత్త విమానాశ్రయాల జాబితాలో తొలిస్థానం దక్కింది. 'విమానాల ఆలస్యం, 14 గంటలు మెటల్ చైర్లోనే ఉండిరావడం, కరెంటు సమస్య, ఒకే వాష్ రూం లాంటి సమస్యలతో పాటూ ఓ హోల్ కారణంగా మూడు ఇంచుల మేర నీరు నిలిచిపోయినా ఎయిర్ పోర్టు అధికారుల నుంచి స్పందన కరువైంది' అని ఓ ప్రయాణికుడు తన అభిప్రాయాన్ని తెలిపాడు.
2) జుబా అంతర్జాతీయ విమానాశ్రయం(జుబా, సౌత్ సూడాన్)
3)పోర్ట్ హార్కోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం(పోర్ట్ హార్కోర్ట్, నైజీరియా)
4) థాష్కెంట్ అంతర్జాతీయ విమానాశ్రయం(థాష్కెంట్, ఉజ్జెకిస్తాన్)
5)సాంటోరిని విమానాశ్రయం( సాంటోరిని, గ్రీస్)
6) చనియా అంతర్జాతీయ విమానాశ్రయం( క్రెటె, గ్రీస్)
7)హెరాక్లియన్ అంతర్జాతీయ విమానాశ్రయం( క్రెటె, గ్రీస్)
8)సిమన్ బోల్వియర్ అంతర్జాతీయ విమానాశ్రయం(కారాకస్, వెనిజూలా)
9) లండన్ లుటన్ అంతర్జాతీయ విమానాశ్రయం(లుటన్, ఇంగ్లాండ్)
10) త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం(కఠ్మాండు, నేపాల్)