అవి తెలియకుండానే మృత్యువు వైపు నడిపిస్తాయి
లండన్: 'ఇప్పటి వరకు బానే ఉన్నాడు. కానీ సడెన్గా అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యానికి శరీరం సహకరించ లేదు. అనూహ్యంగా చనిపోయాడు' ఇలాంటి మాటలు మనం తరుచుగా వింటూనే ఉంటాం. అయితే, చూడ్డానికి ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి అనుకోకుండా మృత్యువాత పడటానికి రెండే రెండు ప్రధాన కారణాలని పరిశోధకులు చెబుతున్నారు. తినే ఆహారంలో పోషకాల లేమి, అధిక రక్తపోటు వల్లనే ప్రాణం పోతుందని తాజా అధ్యయనంలో వెల్లడైనట్లు పరిశోధకులు చెబుతున్నారు.
1990నాటి రోజుల్లో అపరిశుభ్రత, అసురక్షితమైన మంచినీరు, పారిశుద్ధ్యం, చేతులు శుభ్రం చేసుకోకపోవడం వంటి కారణాలు మనకు తెలియకుండానే ప్రాణాంతానికి దారి తీసేవని, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి మారి కేవలం పోషకహార లేమి, అధిక రక్తపోటు అనే రెండు కారణాలే మన శరీర పనితీరు వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపి ఆయా రోగాలను కలిగించి మృత్యువువైపు మళ్లిస్తాయట. ఈ విషయాలను వాషింగ్టన్ యూనివర్సిటీ, మెల్బోర్న్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ విషయాలను వెల్లడించారు.