వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. మల్టీ లాగిన్‌ | Whatsapp new features to be come soon | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. మల్టీ లాగిన్‌

Published Sat, Jun 13 2020 11:19 AM | Last Updated on Sat, Jun 13 2020 1:09 PM

Whatsapp new features to be come soon - Sakshi

కొత్త  ఫీచర్లను అందిస్తూ వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా మరిన్ని కొత్త ఫీచర్లను తెచ్చేందుకు వాట్సాప్‌ సన్నాహాలు చేస్తోంది. వీటిలో మల్టీ లాగిన్‌ డివైస్‌ సపోర్ట్‌, సెర్చ్‌ బై డేట్‌ ఆప్షన్‌, క్లియరింగ్‌ చాట్‌ ఫీచర్లు ఉన్నాయి. మల్టీ లాగిన్‌ డివైస్‌ సపోర్ట్‌ ఫీచర్‌తో ఒకేసారి వివిధ డివైస్‌లలో వాట్సాప్‌ లాగిన్‌ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వివిధ డివైస్‌ల నుంచి ఒకే సమయంలో చాట్‌ చేసే అవకాశం ఉంది. సమూహంగా ఏర్పడి పని చేసుకునే వారికి ఈ ఫీచర్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఒక చోట లాగిన్‌ అయ్యి మరోకరు లాగిన్‌ అవ్వాలంటే ఖచ్చితంగా లాగ్‌అవుట్‌ అవ్వాల్సి ఉంటుంది.    

ఇక, చాట్ విండోస్‌లో సరికొత్త 'సెర్చ్ ఆప్షన్' తీసుకురాబోతోందని డబ్ల్యూఏబేటాఇన్ఫో వెల్లడించింది. నిర్ధిష్ట తేదీ ఆధారంగా శోధించే సెర్చ్‌ బై డేట్‌ ఆప్షన్‌ను యూజర్లకు పరిచయం చేయబోతోందని తెలిపింది. అయితే ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని.. అందుబాటులోకి వచ్చేందుకు కొంత సమయం పట్టవచ్చని అభిప్రాయపడింది. సెర్చ్‌ బై డేట్‌ ఆప్షన్‌ అందుబాటులోకి వస్తే వాట్సాప్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement