ట్రంప్‌ నిర్ణయంపై డబ్ల్యూహెచ్‌ఓ స్పందన.. | WHO Responds On Donald Trumps Decision | Sakshi
Sakshi News home page

‘ప్రజల ప్రాణాలు కాపాడటంపైనే ఫోకస్‌’

Published Wed, Apr 15 2020 6:29 PM | Last Updated on Wed, Apr 15 2020 6:29 PM

WHO Responds On Donald Trumps Decision - Sakshi

న్యూయార్క్‌ : కరోనా మహమ్మారిని నిరోధించి ప్రజల ప్రాణాలను కాపాడటంపైనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రధానంగా దృష్టిసారించిందని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ స్పష్టం చేశారు. డబ్ల్యూహెచ్‌ఓకు అమెరికా నిధులను నిలిపివేస్తామని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం ప్రకటించిన నేపథ్యంలో ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథానమ్‌ గేబ్రియసస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సమయాన్ని వృధా చేయదల్చుకోలేదు..ప్రజలందరి ప్రాణాలు కాపాడుతూ..మహమ్మారిని అడ్డుకోవడంపైనే డబ్ల్యూహెచ్‌ఓ కృషి చేస్తుంద’ని పేర్కొన్నారు.

కాగా కరోనా వైరస్‌(కోవిడ్‌-19 )సంక్షోభం గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైనందున ఆ సంస్థకు అమెరికా అందించే నిధులను నిలిపివేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నామని ట్రంప్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. శ్వేతసౌధంలో విలేకర్లతో మాట్లాడిన ట్రంప్‌... కరోనా విషయంలో చైనాకు అనుకూలంగా డబ్ల్యూహెచ్‌ఓ వ్యవహరించిన తీరు సరైంది కాదని దుయ్యబట్టారు.

చదవండి : కరోనా: డబ్ల్యూహెచ్‌ఓకు షాకిచ్చిన ట్రంప్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement