బీజింగ్ : భారత్‌తో కలిసి మరింత ముందుకు వెళతామని, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకుంటామని చైనా స్పష్టం చేసింది. డోక్లామ్ వివాదాన్ని పక్కన పెట్టేశామని, ఆ విషయం పట్టించుకోకుండా ఆ వివాదం జోలికి వెళ్లకుండా అభివృద్ధిలో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు చైనా అధికారి మా జాన్‌వూ తెలిపారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 68వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
'ఇండియా-చైనా కలిసి పనిచేస్తున్నాయి. ఈ నెల(సెప్టెంబర్) 5న ఇరు దేశాల సంబంధాలను ఎలా వృద్ధిలోకి తీసుకొచ్చుకోవాలో మా అధ్యక్షుడు జీజిన్‌పింగ్, భారత్ ప్రధాని నరేంద్రమోదీ కలిసి చర్చించుకున్నారు. సుదీర్ఘకాలంగా రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నట్లుగానే ఇక ముందు కూడా అభివృద్ధిని, సహకారాన్ని పెంచుకోగలం. ఇక డోక్లామ్ ఎపిసోడ్‌కు తెరపడినట్లేనా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. 'అవును.. ఆ విషయాన్ని పక్కన పడేసి కలిసి పనిచేస్తూ ముందుకు సాగాలని అనుకుంటున్నాము' అని ఆయన స్పష్టం చేశారు.
'భారత్‌తో మాకు ఇక పంచాయితీల్లేవ్'
Published Sat, Sep 23 2017 6:46 PM | Last Updated on Sat, Sep 23 2017 6:48 PM
Advertisement