లండన్: స్మార్ట్‌ఫోన్‌లోనో, కంప్యూటర్‌లోనో అదేపనిగా గేమ్స్ ఆడుతూ.. ఏదైనా పనిచేస్తూ ఉండేవారికి మెడపై ముడతలు పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు వాడే వారికి.. ‘టెక్ నెక్’గా పేర్కొనే ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువని సీఏసీఐ ఇంటర్‌నేషనల్ ఎండీ నాథన్‌సన్ పేర్కొన్నారు.
ఎటువంటి గాయాలతో సంబంధం లేకుండా.. మెడ చుట్టూ అసహ్యంగా కనిపించేలా గీతలు ఏర్పడుతున్నాయంటూ కొంతకాలంగా తమను పెద్ద సంఖ్యలో బాధితులు సంప్రదిస్తున్నారని చెప్పారు. దీనికి కారణమేమిటని అన్వేషించగా... అదేపనిగా గంటల తరబడి ఫోన్లు, ట్యాబ్లెట్లను వినియోగిస్తూ, మెడను వంచి ఉంచడమేనని వెల్లడైందని తెలిపారు. కదలకుండా ఎక్కువ సమయం కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లపై పనిచేసేవారికి మెడపై దవడల కింద గీతలు ఏర్పడి, ముడతలు పడే అవకాశముందని పేర్కొన్నారు.