computer games
-
అన్ని రంగాల్లోనూ ఆత్మనిర్భర్
న్యూఢిల్లీ: అన్ని రంగాల్లోనూ స్వావలంబ భారత్ దిశగా కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆటబొమ్మల మార్కెట్ సుమారు రూ. 7 లక్షల కోట్లు కాగా.. అందులో భారత్ వాటా చాలా తక్కువగా ఉందని గుర్తు చేశారు. భారత్‌లోని స్టార్టప్స్, యువ పారిశ్రామికవేత్తలు ఈ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచ ఆట బొమ్మల కేంద్రంగా భారత్ రూపుదిద్దుకోగలదని, స్థానిక ఆట బొమ్మలకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని ‘మన్ కీ బాత్’లో మోదీ వ్యాఖ్యానించారు. ‘దేశంలో నిపుణులైన బొమ్మల తయారీదారులున్నారు. బొమ్మల తయారీ ద్వారా దేశ ఘన చరిత్రను ప్రచారం చేయవచ్చు. గొప్ప భవిష్యత్తుకు బాటలు వేయవచ్చు’అన్నారు. ప్రత్యేకంగా భారత్‌పైనే, భారత్‌లోనే కంప్యూటర్ గేమ్స్ రూపకల్పన జరగాలని, ఆ దిశగా సమిష్టిగా కృషి చేయాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కోరారు. భారత దేశ సాంస్కృతిక ఔన్నత్యం, సంప్రదాయాలు కొత్త కొత్త కంప్యూటర్ గేమ్స్ తయారీకి స్ఫూర్తినివ్వగలవన్నారు. ‘మన దేశంలో చాలా విషయాలున్నాయి. మన చరిత్ర ఘనమైనది. దేశ చరిత్రపై ఆధారపడ్డ గేమ్స్‌ను భారత్‌లోనే రూపొందించాలని దేశంలోని నిపుణులైన యువతను కోరుతున్నా’అన్నారు. ప్రతీనెల చివరి ఆదివారం ‘మన్ కీ బాత్’పేరుతో ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారనే విషయం తెలిసిందే. ప్రపంచ ఆట బొమ్మల మార్కెట్లో భారత్ వాటాను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవల ప్రధాని మోదీ ఒక అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆటబొమ్మల ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా ప్రథమ స్థానంలో ఉంది. ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ► కరోనా మహమ్మారి సమయంలో ఉత్సవాల నిర్వహణలో భారతీయులు గొప్ప సంయమనం, నిరాడంబరతను పాటిస్తున్నారు. ఇది అభినందనీయం. ► ఈ ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఇందుకు అన్నదాతలకు అభినందనలు. గత సంవత్సరం కన్నా మొత్తంగా దాదాపు 7% సాగు విస్తీర్ణం పెరిగింది. వరి సాగు 10%, పప్పు ధాన్యాల సాగు 5%, నూనెగింజల సాగు 13%, పత్తి సాగు 3% పెరిగింది. ► 2022 నాటికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలవుతున్న నేపథ్యంలో.. స్థానిక స్వాతంత్య్ర సమరయోధుల గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించాలి. నాడు స్థానికంగా జరిగిన ఘటనలను, కార్యక్రమాలను వారికి విశదీకరించాలి. దానివల్ల మరుగునపడిన చాలామంది స్వాతంత్య్ర యోధుల చరిత్ర ప్రపంచానికి తెలుస్తుంది. ► ఇటీవల జరిగిన ఆత్మనిర్భర్ యాప్ ఇన్నోవేషన్ పోటీకి వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికం దేశంలోని చిన్న, మధ్యతరహా పట్టణాల నుంచే వచ్చాయి. ఆత్మ నిర్భర్ భారత్ దిశగా చోటు చేసుకున్న కీలక ముందడుగుగా దీన్ని భావించవచ్చు. ► భారతీయ పండుగలకు, ప్రకృతికి మధ్య గొప్ప సంబంధముంది. ప్రస్తుత గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో చాలా ప్రాంతాల్లో పర్యావరణ హిత వినాయకుడి ప్రతిమలనే ప్రతిష్టించడం ముదావహం. ► సెప్టెంబర్ నెలను పోషకాహార మాసంగా పరిగణిస్తున్నాం. ముఖ్యంగా గ్రామాల్లో అందరికీ పోషకాహారం అందించడం ఉద్యమంలా మారాలి. ► భారత వ్యవసాయ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతీ జిల్లాలో పండించే పంటల వివరాలు, వాటిలోని పోషకాల వివరాలు అందులో అందుబాటులో ఉంచుతాం. ► కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉద్దేశించిన మార్గదర్శకాలను పాటించండి. మాస్క్ ధరించండి. భౌతిక దూరం పాటించండి. వ్యక్తిగత పరిశుభ్రత కొనసాగించండి. సోఫీ.. విదా.. బలరామ్! కుక్క పిల్లలను పెంచుకోవాలనుకునే వారు ఇండియన్ బ్రీడ్ కుక్క పిల్లలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని కోరారు. భారతీయ కుక్కపిల్లలు సామర్థ్యంలో వేటికీ తీసిపోవన్నారు. చవకగా లభిస్తాయని, భారతీయ పరిస్థితులకు తట్టుకోగలవని వివరించారు. ‘ఇండియన్ బ్రీడ్స్లో ముధోల్ హౌండ్, హిమాచలి హౌండ్ శ్రేష్టమైనవి. రాజపాలాయం, కన్నీ, చిప్పిపరాయి, కొంబయి కూడా గొప్పవే. ఇంటర్నెట్లో వెతకండి. వీటి గురించి మరిన్ని ఆశ్చర్యపరిచే వివరాలు తెలుస్తాయి’అని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా.. ఆగస్టు 15న ‘చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమండేషన్ కార్డ్’పురస్కారం పొందిన ఆర్మీ డాగ్స్ సోఫీ, విదాలను గుర్తు చేశారు. దేశ భద్రతలో అవి గొప్ప పాత్ర పోషించాయన్నారు. ‘అమర్నాథ్ యాత్రా మార్గంలో దుండగులు పెట్టిన పేలుడు పదార్థాలను బలరామ్ అనే శునకం గుర్తించి, అనేక ప్రాణాలను కాపాడింది’అని వివరించారు. ‘బీడ్ పోలీసులు తమతో పాటు పనిచేసిన రాకీ అనే శునకానికి గొప్పగా ఫేర్వెల్ ఇచ్చిన దృశ్యాలు మీరు టీవీలో చూసే ఉంటారు. 300 కేసులను ఛేదించడంలో పోలీసులకు రాకీ సహకరించింది’అన్నారు. కావాల్సింది పరీక్షలపై చర్చ: రాహుల్ ప్రధాని మోదీ మన్‌కీబాత్‌లో పరీక్షల గురించి మాట్లాడతారని విద్యార్థులు ఎదురు చూస్తుండగా.. ఆయన మాత్రం బొమ్మల గురించి మాట్లాడారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నీట్, జేఈఈ పరీక్షలను కోవిడ్ దృష్ట్యా వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా కోరుతున్న విషయం తెలిసిందే. ప్రధాని నోట ఏటికొప్పాక మన్‌కీ బాత్ కార్యక్రమంలో బొమ్మల గురించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఏటికొప్పాక బొమ్మల ప్రస్తావన తెచ్చారు. విశాఖకు చెందిన సి.వి.రాజు అద్భుతమైన నాణ్యతతో ఏటికొప్పాక బొమ్మలను తయారు చేస్తున్నారని కొనియాడారు. ఆయన స్థానిక బొమ్మలకు పూర్వవైభవం తెచ్చారన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నిపుణులైన బొమ్మల తయారీదారులు ఉన్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కొండపల్లి, కర్ణాటకలోని చెన్నపట్నం, తమిళనాడులోని తంజావూరు, అస్సాంలోని ధుబారీ, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి బొమ్మల తయారీ కేంద్రాలుగా ఎదిగాయన్నారు. -
అతి అనర్థమే...
వీడియోగేమ్స్‌కు అతుక్కుపోతున్న చిన్నారులు కంటి జబ్బులు వచ్చే అవకాశం చదువుపైనా తీవ్ర ప్రభావం సాగర్‌నగర్ : అతి అనర్దదాయకమే అని పెద్దలు ఊరకే అనలేదు. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్, వీడియో, కంప్యూటర్ గేమ్స్‌పై పిల్లలు చూపుతున్న ఆసక్తి అంతా ఇంతా కాదు. ఫలితంగా చిన్న వయస్సులోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. చిన్నారులు మారాం చేస్తే స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్, కిడ్స్ బొమ్మలు ఆన్ జేసి వారికెదురుగా పెడుతున్నారు. దీంతో వాటికి అలవాటుపడుతున్నారు. రోజురోజుకు అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో పనులు సులువుగా చక్కబెట్టుకుంటున్నాం. అయితే ఈ ఆధునాతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని అదుపులో పెట్టుకోవడం కూడా అంతే అవసరం. ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్తగా లేకుంటే అనర్ధాలు కొని తెచ్చుకున్నట్టవుతుంది. స్కూల్ నుంచి ఇంటికి రాగానే పిల్లలు ఆటలపై ఆసక్తి చూపుతారు. గతంలో క్రికెట్, వాలీబాల్, వంటి క్రీడల ద్వారా శారీరక శ్రమతో ఆరోగ్యానికి మేలు జరిగేది. కానీ టెక్నాలజీ పుణ్యమా అని స్మార్ట్సెఫోన్లు, టీవీలు, కంప్యూటర్ తప్పనిసరి అవసరంగా మారడం, పిల్లలను బయటకు పంపించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడకపోవడం తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పిల్లలు ఆటపాటలకు పక్కన పెట్టి వీడియో, కంప్యూటర్ గేమ్స్‌ను అతుక్కుపోతున్నారు. తల్లిదండ్రుల గారాబం కంప్యూటర్ల ముందు పిల్లలు గంటల సేపు గడపడాన్ని చాలా గొప్ప విషయంగా తల్లిదండ్రులు బావిస్తున్నారు. అందుకే వారు కూర్చున్న చోటకే అన్నం, పాలు వంటి ఆహార పదార్థాలను అందిస్తూ మురిసిపోతున్నారు. అలాగే ఏడ్చే పిల్లోడికి స్మార్ట్పోన్లో గేమ్స్ నొక్కితుంటే తల్లిదండ్రులు సంబర పడుతున్నారు. కానీ దీని వల్ల దీర్ఘకాలంలో అనార్దలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మిగితా శరీర అవయవాల మీద శ్రమ తగ్గడం వల్ల ఆ మేరకు కళ్ల మీద అధిక ప్రభావం పడుతుంది. దీంతో 15 ఏళ్ల వయస్సులోనే చిన్నారులు లేనిపోని ఆనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. చదువులోనూ వెనకడుగే గేమ్స్ ఆడే క్రమంలో ఎత్తులకు పైఎత్తులు వేస్తూ గేమ్స్‌లో ఒక్కో స్టేజ్ దాటుకుంటూ ముందుకు పోతుంటారు. ఇలాంటి సందర్భాల్లో శరీరంలో అడ్రినల్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుందని, అధిక మోతాదుల్లో అడ్రినల్ శరీరంలో విడుదల కావడం మంచిది కాదని కేజీహెచ్ వైద్యనిపుణుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. దీనికి తోడు టీవీలు కంప్యూటర్లలో ఆడే వీడియో గేమ్స్‌పై ఆసక్తి ఎక్కువైతే తరగతి గదుల్లో చెప్పే పాఠాలు బోర్ కొడతాయి. పాఠాల్లో ఉండే విషయాలు కంటే గేమ్స్‌లో ఉండే అడ్వెంచర్స్ వారిని ఎక్కువగా ఆకట్టుకుంటాయి. ఇలాంటి వారు రానురాను చదువులో వెనకబడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పిల్లలు పరిమిత సమయం కన్నా ఎక్కువ సేపు వీడియో గేమ్స్ వైపు ఆకర్షితులవుతున్నారా లేదా అన్న విషయాన్ని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అదే విధంగా నెట్ సర్ఫింగ్‌లో ఎక్కువ సమయం గడిపే అలవాటును మాన్పిస్తే మంచిదని సూచిస్తున్నారు. కళ్లపై అధిక భారం : సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు.. అయితే పిల్లలు రోజులో ఎక్కువ సేపు టీవీలు, కంప్యూటర్ మానిటర్లకు అతుకుపోవడం వల్ల కళ్లపై అధిక భారం పడుతుంది. దాంతో కంటి సంబంధిత జబ్బులు, తలనొప్పి వంటి రోగాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితులో మార్పు తీసుకురాకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఇటు ఉపాధ్యాయులు, అటు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న వయస్సులోచూపుపై ప్రభావం పడితే విమానయాన, సైనికరంగాల్లో ఉపాధి అవకాశాలకు గండిపడే ప్రమాదం ఉంది. సైట్ వచ్చే అవకాశం ఎక్కువ అతిగా టీవీ చూడడం, గేమ్స్ ఆడడం వల్ల చాలా దుష్పరిణామాలు ఉంటాయి. ముఖ్యంగా కళ్లకు సంబంధించి సమస్య ఎక్కువగా కనబడుతుంది. చిన్న వయస్సులోనే కళ్లద్దాలు వినియోగించాల్సిన వస్తోంది. ఎవరైనా సరే కాస్తై శరీరక శ్రమ చేయాలి. పిల్లలు ఈ పనిని ఆటల ద్వారా చేస్తారు. శరీరక శ్రమకు దూరమైన పిల్లల్లో క్రమంగా రోగ నిరోధకశక్తి తగ్గుతుంది. పిల్లల ఎదుగదలపై ప్రభావం చూపుతుంది. - శ్రీకుమార్, కంటి వైద్య నిపుణుడు ఆసక్తి తగ్గించాలి పిల్లలు టీవీని చూసి ఆనందిస్తారు. అయితే అతిగా చూడడం వల్ల అనర్ధాలు వస్తాయని పిల్లలు బలవంతంగా టీవీకి దూరంగా చేయకూడదు. అలా చేస్తే తల్లిదండ్రుల పట్ల వారు శత్రుత్వం పెంచుకుంటారు. వారి మనస్సు మారే విధంగా ఎక్చర్సైజులు చేయించాలి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల అభిరుచిని బట్టి సంగీతం, క్రీడలు, ఆర్ట్స్ వంటి అంశాల్లో శిక్షణ ఇప్పించాలి. - డాక్టర్ రమణమూర్తి, సైకాలజిస్ట్ -
చేదు జ్ఞాపకాల్ని మర్చిపోవాలనుకుంటున్నారా?
న్యూయార్క్: జ్ఞాపకాలు.. కొన్ని తీపివి.. మరి కొన్ని చేదువి. తీపి జ్ఞాపకాల్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని భావిస్తే చేదు జ్ఞాపకాల్ని మాత్రం త్వరగా మర్చిపోవాలనుకుంటాం. అయితే అది అంత సులభం కాదు. కానీ దీనికో చిన్న ఉపాయం సూచిస్తున్నారు నిపుణులు. కంప్యూటర్ గేమ్స్ ఆడితే ఇలాంటి అవాంచిత జ్ఞాపకాలు తగ్గుతాయని వారు సూచిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం మెదడుకు గాయం కావడం వల్ల ఇలాంటి అవాంచిత జ్ఞాపకాలు ఏర్పడే అవకాశం ఉంది. మెదడులో గాయాలున్న వారు అవాంచిత దృశ్యాల్ని చూడడానికి ఇష్టపడరు. వాటిని మర్చిపోవాలని వారు భావిస్తారు. మళ్లీ సాధారణ స్థితికి రావాలని కోరుకుంటారు. అయితే కంప్యూటర్ గేమ్స్ ఆడడం వల్ల ఇలాంటి విషయాల్ని త్వరగా మర్చిపోగలుగుతారని శాస్త్రవేత్తలు తెలిపారు. తమ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు తెలిపారు. -
కంప్యూటర్ గేమ్స్‌తో అవాంఛిత జ్ఞాపకాలు దూరం
న్యూయార్క్: జ్ఞాపకాలు.. కొన్ని తీపివి.. మరి కొన్ని చేదువి. తీపి జ్ఞాపకాల్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని భావిస్తే చేదు జ్ఞాపకాల్ని మాత్రం త్వరగా మర్చిపోవాలనుకుంటాం. అయితే అది అంత సులభం కాదు. కానీ దీనికో చిన్న ఉపాయం సూచిస్తున్నారు నిపుణులు. కంప్యూటర్ గేమ్స్ ఆడితే ఇలాంటి అవాంచిత జ్ఞాపకాలు తగ్గుతాయని వారు సూచిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం మెదడుకు గాయం కావడం వల్ల ఇలాంటి అవాంచిత జ్ఞాపకాలు ఏర్పడే అవకాశం ఉంది. మెదడులో గాయాలున్న వారు అవాంచిత దృశ్యాల్ని చూడడానికి ఇష్టపడరు. వాటిని మర్చిపోవాలని వారు భావిస్తారు. మళ్లీ సాధారణ స్థితికి రావాలని కోరుకుంటారు. అయితే కంప్యూటర్ గేమ్స్ ఆడడం వల్ల ఇలాంటి విషయాల్ని త్వరగా మర్చిపోగలుగుతారని శాస్త్రవేత్తలు తెలిపారు. తమ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు తెలిపారు. -
బచ్‌ఫన్.. థియేటర్ హంగామా
కంప్యూటర్ గేమ్స్.. కార్టూన్ చానల్స్.. ఫేస్బుక్ షేరింగ్స్.. నయా జమానా పోకడ ఇది. ఆటలు, పాటలున్న సినిమాలే అసలైన ఆటవిడుపనుకునే ఈ తరం.. నాటకాలనూ తెగ ఎంజాయ్ చేస్తోంది. రంగురంగుల సినిమా బొమ్మలే కాదు.. రంగస్థలం హంగులనూ చూస్తామంటోంది. లైవ్‌లో నటిస్తూ.. అలరిస్తున్న నటులను చప్పట్లతో ఎంకరేజ్ చేస్తోంది. రెండు రోజులుగా సిటీలో జరుగుతున్న హైదరాబాద్ చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్-2014కు వెళ్లి చూస్తే ఈ సీన్ కనిపిస్తోంది. నాటకం రమ్యం అని ఆనాడు కాళిదాసు చెప్పిన మాటకు వంతపాడుతున్నారు నేటి సిటీ చిన్నారులు. సహజత్వంతో పోటీపడుతూ సాగిపోయే కళాకారుల నటన ఈ తరాన్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. అందుకే గంట, గంటన్నర నిడివి ఉండే నాటకాలకు గ్రాండ్ సలామ్ చెబుతున్నారు పిల్లలు. డ్రామా ఆర్టిస్టుల హాస్యం.. చిన్నారుల పొట్టలు చెక్కలయ్యేలా నవ్విస్తోంది. ఇన్నాళ్లూ మిస్సయిన ఆనందం ఏంటో పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. అందుకే డ్రామా పూర్తయ్యే వరకూ కన్నార్పకుండా చూసి సంబరపడిపోతున్నారు. మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో వైశాలి బిస్ట్స్ థియేటర్ వర్క్‌షాప్ ఆధ్వర్యంలో జరుగుతున్న హైదరాబాద్ చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్-2014 అటు పిల్లలను.. ఇటు పెద్దలను అలరిస్తోంది. బుధవారం నుంచి ప్రారంభమైన ఈ ఫెస్ట్‌లో ఇప్పటికే ముంబైకి చెందిన హబీజబీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ‘ఈట్’, బెంగళూరుకు చెందిన తహట్టో వారి ‘రోమియో అండ్ జూలియట్’ డ్రామాలు ఆకట్టుకున్నాయి. విజ్ఞానం కావాలంటే కంప్యూటర్లో కావాల్సినంత దొరుకుతుంది. కానీ సామాజిక అవగాహన నాటకాల ద్వారానే కలుగుతుందంటున్నారు తల్లిదండ్రులు. అందుకే తమ పిల్లలకు దగ్గరుండి మరీ నాటకాలు చూపిస్తున్నారు. నగరంలో పిల్లలకు సంబంధించిన రంగస్థల నాటకాలు ఎక్కడ జరిగినా అక్కడికి తీసుకెళుతున్నారు. ఉద్యోగంతో ఎప్పుడు బిజీగా ఉండే నగరవాసులు పిల్లలతో పాటు డ్రామాలకు వెళ్లి రిలాక్స్ అవుతున్నారు. పిల్లల్లో ఆసక్తి పెరుగుతోంది ప్రస్తుత ఆధునిక సమాజంలో కనుమరుగవుతున్న రంగస్థల నాటకాల ప్రాముఖ్యాన్ని తెలియజేసేందుకే నగరంలో ‘హైదరాబాద్ థియేటర్ ఫెస్టివల్’ ప్రారంభించాం. ఐదేళ్ల నుంచి ‘థియేటర్’కు క్రేజ్ పెంచే దిశగా కృషి చేస్తున్నాం. ఇందుకు అనుగుణంగా సిటీలో నాటకాలపై తల్లిదండ్రులతో పాటు పిల్లల్లో ఆసక్తి పెరుగుతోంది. - వైశాలి, ఫౌండర్, వైశాలి బిస్ట్స్ థియేటర్ వర్క్‌షాప్ సిటీలో మంచి క్రేజ్ ఉంది ‘బెంగళూరులోనూ థియేటర్‌కు మంచి ఆదరణ పెరుగుతోంది. హైదరాబాద్ వేదికగా రోమియో అండ్ జూలియెట్ పాత్రలో కనిపించడం అదృష్టంగా భావిస్తున్నాం. మేం చేసిన నటనకు హైదరాబాదీలు ఇచ్చిన ప్రోత్సాహం అద్భుతం. ఈ ఫెస్ట్‌కు వచ్చే వారిని చూస్తే రానురాను ఈ సిటీ నుంచి కూడా మంచి థియేటరీ ఆర్టిస్ట్‌లు తెరపైకి వస్తారనుకుంటున్నామ’ని బెంగళూరుకు చెందిన ప్రశాంత్ నాయర్, కళ్యాణి నాయర్ తెలిపారు. ఇది మూడోసారి... ప్రత్యక్షంగా నాటక ప్రదర్శన చూడటం ఇది మూడోసారి. అమ్మ వల్లే మంచి వినోదం కలిగిన నాటకాలను చూడగలిగా. అనేక విషయాలు తెలుసుకోగలిగా. భవిష్యత్‌లోనూ నేను కూడా ఇలాంటి పాత్రలు పోషించాలనుకుంటున్నా. -క్రిశాంతిని, గీతాంజలి పాఠశాల, బేగంపేట సందేశం.. వినోదం.. ఇతర నగరాలకు చెందిన కళాకారులు ఇక్కడ వేస్తున్న రంగస్థల నాటకాలు పిల్లలను ఆలోచింపజేస్తున్నాయి. అర్థవంతమైన ప్రదర్శనతో మంచి సందేశం, వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ డ్రామాల వల్ల పిల్లలకు ప్రేమానురాగాలు, సమాజంలో ఎలా ఉండాలనే దానిపై క్లారిటీ వస్తుంది. -శిరీష, గృహిణి, ఎస్ఆర్ నగర్ ‘సురభి’ మాయాబజార్ నేడు హైదరాబాద్ చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్లో తొలిసారిగా తెలుగు రంగస్థల నాటికను ప్రదర్శించబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 6.30కి శిల్పకళా వేదిక (మాదాపూర్)లో ‘సురభి’ ఆధ్వర్యంలో ‘మాయాబజార్’ నాటకం ప్రదర్శిస్తున్నారు. - వాంకె శ్రీనివాస్ -
ఫోన్లతో మెడపై ముడతలు
లండన్: స్మార్ట్ఫోన్లోనో, కంప్యూటర్లోనో అదేపనిగా గేమ్స్ ఆడుతూ.. ఏదైనా పనిచేస్తూ ఉండేవారికి మెడపై ముడతలు పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు వాడే వారికి.. ‘టెక్ నెక్’గా పేర్కొనే ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువని సీఏసీఐ ఇంటర్నేషనల్ ఎండీ నాథన్సన్ పేర్కొన్నారు. ఎటువంటి గాయాలతో సంబంధం లేకుండా.. మెడ చుట్టూ అసహ్యంగా కనిపించేలా గీతలు ఏర్పడుతున్నాయంటూ కొంతకాలంగా తమను పెద్ద సంఖ్యలో బాధితులు సంప్రదిస్తున్నారని చెప్పారు. దీనికి కారణమేమిటని అన్వేషించగా... అదేపనిగా గంటల తరబడి ఫోన్లు, ట్యాబ్లెట్లను వినియోగిస్తూ, మెడను వంచి ఉంచడమేనని వెల్లడైందని తెలిపారు. కదలకుండా ఎక్కువ సమయం కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లపై పనిచేసేవారికి మెడపై దవడల కింద గీతలు ఏర్పడి, ముడతలు పడే అవకాశముందని పేర్కొన్నారు.