గల్ఫ్‌లో శక్తిమంతుడైన భారతీయుడిగా మళ్లీ యూసఫలీ | yusaphali again elected as Gulf powerful Indian | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌లో శక్తిమంతుడైన భారతీయుడిగా మళ్లీ యూసఫలీ

Published Mon, Oct 7 2013 2:30 AM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM

గల్ఫ్‌లో శక్తిమంతుడైన భారతీయుడిగా మళ్లీ యూసఫలీ - Sakshi

గల్ఫ్‌లో శక్తిమంతుడైన భారతీయుడిగా మళ్లీ యూసఫలీ

 దుబాయ్: గల్ఫ్‌లో అత్యంత శక్తిమంతుడైన భారతీయుడిగా కేరళకు చెందిన వ్యాపారి యూసఫలీ ఎంపీ వరుసగా నాలుగోసారి రికార్డులకెక్కారు. ‘అరేబియన్ బిజినెస్’ పత్రిక రూపొందించిన ‘గల్ఫ్‌లో శక్తిమంతులైన 100 మంది భారతీయుల’ జాబితాలో అయన అగ్రస్థానంలో నిలిచారు. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అతిపెద్ద రిటైల్ చైన్ మార్కెట్ కలిగిన యూసఫలీ వ్యాపారాల వార్షిక టర్నోవర్ రూ.28 వేల కోట్లు(450 కోట్ల డాలర్లు) అని పత్రిక తెలిపింది. యూసఫలీకి చెందిన ఈఎంకేఈ గ్రూప్ సంస్థల్లో 22 వేల మంది భారతీయులు సహా 27 వేల మంది పనిచేస్తున్నారు. కాగా, జాబితాలో రెండో స్థానంలో అలానా గ్రూప్ అధినేత ఫిరోజ్ అలానా, మూడో స్థానంలో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకింగ్ బాస్ వి.శంకర్ నిలిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement