చెన్నంపల్లి కోటలో తవ్వకాలు సాగిస్తున్న అధికారులు
కర్నూలు ,తుగ్గలి: మండల పరిధిలోని చెన్నంపల్లి కోటలో చేపట్టిన తవ్వకాలపై అధికారులు పట్టువీడ లేదు. 21 రోజులుగా పెద్ద పెద్ద బండరాళ్ల కింద, కోట బురుజులో తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. ఇప్పటికీ కావిటీ స్కానర్లు, రెసెస్టివిటీ మీటరుతో సర్వే చేయించడంతో పాటు జీఎస్‌ఐ డైరెక్టర్ మోహన్ కుల్ బృందం కూడా కోటను పరిశీలించింది. కోటలో నిధిని తీసేందుకు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. ఇంకోవైపు స్వామీజీలు, పురోహితులతో ప్రత్యేక పూజలు, సర్వేలూ కొనసాగుతున్నాయి.
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆదోని ఆర్డీఓ ఓబులేసు, మైనింగ్ ఏడీ నటరాజ్, తహసీల్దార్ గోపాలరావు, వీఆర్‌ఓ కాశీరంగస్వామి, పోలీసుల పర్యవేక్షణలో తవ్వకాలు జరుగుతున్నాయి. కోటలో సర్వే నిర్వహించేందుకు అత్యాధునిక పరికరాలు వస్తాయని చెబుతున్నా రోజురోజుకు ఆలస్యం జరుగుతోంది. రెండు రోజుల్లో పరికరాలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కోటలో ఏముందో తెలియదు కాని గుప్త నిధుల కోసం పురాతన కోటను తవ్వేస్తున్నారన్న విమర్శలు మాత్రం అధికమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment