
ప్రతీకాత్మక చిత్రం
నేను చిన్నప్పటినుంచి ఆంధ్రాలోని నాన్నమ్మ వాళ్ల దగ్గర పెరిగాను. మేలో సెలవులు రాగానే ముంబైలోని అమ్మానాన్నల దగ్గరకి వెళ్లేవాడిని. ఏడవతరగతి వరకు ఆంధ్రాలోనే చదివాను. సెవెన్త్ ఎక్షామ్స్ రాసి ముంబై వెళ్లిపోయాను. అప్పుడు నాన్న వేరే స్కూల్లో చేర్పించాడు. అదే స్కూల్లో మా మామయ్య కూతరు కూడా చదివేది. తను 9వ తరగతి నేను 8వ తరగతి. నిజానికి తను నాకంటే 1 సంవత్సరం చిన్నది. నేను మాత్రం చదువుమీద శ్రద్ధ లేక 1 సంవత్సరం వేస్ట్ చేసుకున్నా. బ్రేక్ టైంలో తను నాకోసం క్లాస్ దగ్గరకు వచ్చేది. టిఫిన్ తిన్నావా అని అడిగేది. అలా ఒక సంవత్సరం గడిచిపోయింది. తను టెన్త్ నేను నైన్త్‌కు వచ్చాము. అప్పుడే తనంటే నాకు ఇష్టం మొదలైంది. డైలీ తనకోసం బస్ దగ్గర వేయిట్ చేసే వాడిని పక్కన కూర్చోవటానికి చాలా సార్లు ట్రై చేశా. ఎప్పుడో ఒకసారి కుదిరేది. ఆమెకు మామిడిపండ్లంటే చాలా ఇష్టం చాలా సార్లు పండ్లు కోసిచ్చాను.
తనకు తెలసు తనంటే నాకిష్టమని. అయితే ఏమీ మాట్లాడేది కాదు. తను టెన్త్ కంప్లీట్ చేసి ఇంటర్ జాయిన్‌అయ్యింది. మా బ్రదర్ తనకు చాలా క్లోజ్! అక్కా అని పిలుస్తాడు. ఒక రోజు తనకు నేను ప్రేమిస్తున్న సంగతి చెప్పేశాడు. తను కూల్‌గా రియాక్షన్ ఇచ్చి, ‘ వాడ్నే వచ్చిచెప్పమను’ అంది. నేను వెళ్లి ప్రపోజ్ చేస్తే నో చెప్పింది. అయినా కూడా ట్రై చేస్తూనే వచ్చా. 2014 టెన్త్ ఫేయిల్ అయ్యా. తన మైండ్‌లో నా ఇమేజ్ ఇంకా డౌన్ అయ్యింది. డైలీ వాట్సాప్‌లో విసిగించేవాడిని తనను. అలా నాలుగేళ్ల తర్వాత నాతో ఫ్రెండ్లీగా మాట్లాడటం మొదలుపెట్టింది. కొన్ని రోజులు వాట్సాప్‌లో చాటింగ్ చేసుకున్న తర్వాత వాయిస్ మెసేజ్‌లు పెట్టేవాడిని. కొన్ని కొన్ని సార్లు వాళ్ల ఇంట్లో ఎవరూ లేనప్పుడు గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్లం.
కొద్దిరోజులకు తను నా లవ్‌ను అంగీకరించింది. తను కాలేజ్‌కు వెళ్లే సమయానికి కలిసేవాడిని. ఓ సంవత్సరం గడిచిపోయింది. ఒకర్ని విడిచి ఒకరం ఉండలేక పోయేవాళ్లం. 2019లో మా మధ్య దూరం పెరిగింది. నేను టెన్త్ ఫేయిల్ తను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. నన్ను బాగా చదువుకోమని బ్రతిమాలింది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను చదవలేకపోయా. అక్టోబర్‌లో వాళ్ల మామ మ్యారేజ్ కోసం విలేజ్‌కు వెళ్లింది. నేను కూడా వెళ్లా తనకోసం. తను నావైపు చూడను కూడా చూడలేదు. మాట్లాడటం మానేసింది, కాల్స్ కూడా చేయటం లేదు. వాళ్ల మామ వాళ్లది నాకంటే బెటర్ పొజిషన్, మంచి ఇళ్లు ఉన్నాయి. తను నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టింది.
తనతో మాట్లాడాలని చాలా ట్రై చేశా కానీ, కుదరలేదు. పెళ్లి తర్వాత ముంబై వచ్చేశాం. తర్వాత తను మెసేజ్ చేసింది. మా మధ్య అప్పటినుంచి నో ఫోన్ కాల్స్... మెసేజ్‌లు మాత్రమే ఉండేవి. ‘ఐదేళ్లలో నువ్వు ఏదైనా చేస్తే నీకు నన్ను ఇస్తారు. ఇప్పుడు నీ దగ్గర ప్రేమ తప్ప ఏమీ లేదు’ అనింది. నా కోసం, వాళ్ల ఫ్యామిలీ కోసం చాలా థింక్ చేసింది. దూరంగా ఉండు నాకు. ప్రేమను చూపించకు’ అని అంది. ‘ దూరంగా అయితే ఉంటా. కానీ, నీ మీద ప్రేమ మాత్రం తగ్గదు’ అని రిప్లై ఇచ్చా. తను దూరంపెట్టడం స్టార్ట్ చేసింది. నేను తన సంతోషంలోనే నా సంతోషం చూసుకుంటూ మాట్లాడటం మానేశా. ఐ రియల్లీ లవ్ ఏ లాట్ మా...
- రవి కుమార్, ముంబై
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment