ఎందుకు వదిలేసి పోయావురా?.. | Breakup Love Stories In Telugu : Raju Sad Love From Hyderabad | Sakshi
Sakshi News home page

ఎందుకు వదిలేసి పోయావురా?..

Published Thu, Jan 2 2020 10:33 AM | Last Updated on Thu, Jan 2 2020 11:00 AM

Breakup Love Stories In Telugu : Raju Sad Love From Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

2006లో అనుకోకుండా ఓ పని మీద నెల రోజులు వేరే ఊరుకి వెళ్లవలసి వచ్చింది. అక్కడ అంతా బాగానే ఉంది. 15రోజులు ఎలాగో గడిచి పోయాయి. నేను పని చేసే యింటి పక్కన ఒక అమ్మాయికి నాకు అసలు పడకపోయేది. ప్రతీ విషయంలో నాతో గొడవ పడేది. నేను స్వతహాగా డ్యాన్సర్‌ని కూడా. పని అయిపోయాక డ్యాన్స్ చేయడం అలవాటు. ఓ రోజు ఆ ఊర్లో ఉత్సవం జరిగింది. తన ఇల్లంతా బంధువులతో నిండి పోయింది. రోజూలాగే ఆ రోజు కూడా నేను డ్యాన్స్ చేస్తున్నా. నేను డ్యాన్స్ చేస్తుంటే అనుకోకుండా తన బంధువులు చూడటానికి వచ్చారు. వాళ్లతో పాటు తను కూడా వచ్చింది. వాళ్లంతా నన్ను మళ్లీ డ్యాన్స్ చేయమని అడిగారు. సరే అని నేను చేశాను.

ఎప్పుడూ నాతో గొడవ పడే ఆ అమ్మాయి నా డ్యాన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. తన బంధువులు కూడా నాతో ‘చాలా బాగా చేశావు’ అన్నారు. ఏమైందో తెలియదు కానీ మరుసటి రోజునుంచి తను నన్ను చూసి నవ్వేది. నేను కూడా నవ్వేవాడిని. అది లవ్ అని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అలా అనుకోకుండా మా ప్రేమ కథ స్టార్ట్‌ అయ్యింది. డైలీ తను నాకు ఒక చిన్న పిల్లాడికి అమ్మ అన్నం కలిపి పెట్టినట్లు ముద్దలు కలిపి పెట్టేది. అలా మిగితా 15రోజులు గడిచిపోయాయి. నేను మళ్లీ హైదరాబాద్ తిరిగి వచ్చేశాను. అప్పుడు తను ఎంత ఏడిచిందో నేను కూడా అంతలా ఏడ్చాను. మా ఇద్దరి కులాలు వేరు, వేరు. ఒకసారి వాళ్ల అమ్మని వేరే విధంగా అడిగాను ‘మీ అమ్మాయికి పెళ్లి చేయటానికి ఎలాంటి వాడు కావాలి?’ అని.

తను వాళ్ల కులం తప్ప వేరే వాళ్లకు ఇచ్చి పెళ్లి చేయనని చెప్పింది. ఆ అమ్మాయి మాత్రం నేను లేకుండా ఉండలేను అని చెప్పింది. హైదరాబాద్‌కు తిరిగొచ్చాక మా ఇంట్లో విషయం చెప్పాను! ఓకే అన్నారు. ఒక మా అన్నయ్య తప్ప. అప్పుడు నా ఫ్రెండ్స్ నాకు తనకు శంషాబాద్ సిద్దుల గుట్ట శివాలయంలో పెళ్లి చేయటానికి అంతా రెడీ చేశారు. తను బస్ ఎక్కే టైంకి తన బ్రదర్ పట్టుకున్నాడు. తను రాలేదు. కానీ, నా ఫ్రెండ్స్ మళ్లీ తనని తన ఊరికి వెళ్లి తీసుకుని వద్దాం అని వెళ్లాం. అప్పుడు వాళ్ల బ్రదర్ నా లవ్‌ మ్యాటర్‌ వాళ్ల ఇంట్లో చెప్పాడు. పెద్ద గొడవ మొదలైంది. నేను అక్కడినుంచి హైదరాబాద్‌ తిరిగొచ్చేశాను.

తర్వాత మా అన్న నాకు వేరే సంబంధం చూశాడు. వద్దని చెప్పినా వినలేదు. ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. తను నాకు ఫోన్‌ చేసి చాలా ఏడ్చింది! నేను కూడా ఏడ్చాను. ఫైనల్లీ నాకు మ్యారేజ్‌ అయిపోయింది. కానీ, నాకు మాత్రం తను ప్రతీ నిమిషం గుర్తుకు వచ్చేది. తనకోసం మళ్లీ వాళ్ల యింటికి వెళ్లాను. కానీ, తనతో మాట్లాడలేదు. మళ్లీ ఇంకోసారి తన కాలేజ్‌ దగ్గరకు వెళ్లాను! ప్రయోజనం లేకపోయింది. 2009లో తనకి మ్యారేజ్‌ అయ్యింది. ఇక తనని చూడలేదు. మళ్లీ అనుకోకుండా ఒక రోజు తన ఫోన్‌ నెంబర్‌ దొరికింది. ఫోన్‌ చేసినా రిప్లై ఇవ్వలేదు. వెంటనే నా నెంబర్‌ బ్లాక్‌ చేసింది.

తను సంతోషంగా ఉందని తెలిసింది. నేను కూడా హ్యాపీగా ఫీలయ్యా. అనుకోకుండా మళ్లీ తను నాకు మెసేజ్‌ చేసింది. తను కూడా నేను ఎలా ఉన్నానో తెలుసుకోవడానికి ఫోన్‌ చేసింది. అప్పుడప్పుడు ఫోన్‌ చేసి ‘ఎందుకు వదిలేసి పోయావురా?’ అన్నప్పుడు నాకు చచ్చిపోవాలనిపించేది. నేను కోరుకునేది ఒక్కటే! నా వల్ల తనకు ఎలాంటి సమస్య రావద్దని. అందుకే నేను తనకు ఎలాంటి మెసేజ్‌ కానీ కాల్‌ కానీ చేయటం లేదు. తను చేస్తే తప్పకుండా రిప్లై ఇస్తాను. లైఫ్‌లాంగ్‌ నీకు ఎలాంటి ప్రాబ్లెమ్ వచ్చినా నేను నీతో ఉంటాను. త్వరలో నీ పేరుతో ఒక అనాధాశ్రమం పెట్టాలనే కోరిక ఉంది. తప్పకుండా పెడతాను. నువ్వు హ్యాపీగా ఉంటే అదే చాలు అమ్మ. 
- ఇట్లు... నీ రాజు


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement