
ప్రతీకాత్మక చిత్రం
నేను బొబ్బిలిలో డిప్లొమా చదువుతున్న రోజుల్లో మా ఫ్రెండ్ వాళ్ల ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫేస్‌బుక్‌లో నాకు పరిచయం అయ్యింది. స్నేహం బలపడి, క్రమేపి తను నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది. ఆ అమ్మాయి వాళ్ల నాన్న వాళ్లింట్లో వాళ్లని అస్సలు పట్టించుకునేవారు కాదు. తను ఎప్పుడూ ఆ బాధలు నాతో చెప్తూ బాధ పడుతూ ఉండేది. ఒకరోజు ఆ బాధల్ని పోగొట్టి తన జీవితంలో సంతోషం చూడాలని తనకి ప్రపోజ్ చేశా. వెంటనే తను ఒప్పుకుంది. తను ఒప్పుకున్న మూడు నెలలకే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అలా మా ప్రేమ కొనసాగుతున్న తరుణంలో మాకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుంటే ఆశ్చర్యానికి లోనయ్యాము. తన క్యాస్ట్, తన బ్లడ్ గ్రూప్, తన చేతివాటం(లెఫ్ట్ హ్యాండ్), తన జన్మ నక్షత్రం, రాశి, ఒకే ఊరు అన్నీ ఒకేలా నాలానే ఉన్నాయి.
మేము 6 సంవత్సరాలు కలిసి ఉన్నా ఎప్పుడూ ఎటువంటి సినిమాలకి, పార్క్‌లకు వెళ్లలేదు. అలా అని ఇప్పుడు ఉన్నట్టు అడ్వాంటేజ్ కూడా తీసుకోలేదు. దానికి కారణం నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తాదని ఇద్దరం గట్టిగా నమ్మాం. అలా అనే ఇద్దరి ఇంట్లో నాలుగు నెలల క్రితం చెప్పాం. మా ఇంట్లో ఒప్పుకోగానే వాళ్ల ఇంటికి మా అమ్మానాన్నలని తీసుకుని వెళ్లా. ఇద్దరికీ ఏప్రిల్లో పెళ్లి చేసేస్తాం అని అన్నారు వాళ్ల నాన్న. ఇక మా ఆనందానికి అవధులు లేవు.
కానీ రెండు నెలల తర్వాత ‘ ఇద్దరి జాతకాలు సెట్ అవ్వలేదంట.. మేము మా అమ్మాయికి వేరే సంబంధం చూసేస్తాం’. అని చెప్పి వెళ్లిపోయారు. ఆ అమ్మాయిని అడిగితే ‘మా అమ్మ నేను ఎంత అడిగినా వినట్లేదు వేరే సంబంధం తెచ్చేశారు. ఏం చేస్తాం చెప్పు!’ అని చెప్పి నా నెంబర్ బ్లాక్ చేసేసింది. వాళ్ల నాన్నకి నాకంటే ఇంకా బెస్ట్ ఎక్కడ దొరికాడో?.. గవర్నమెంట్ ఉద్యోగిని, స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు లేదు. ఒకే ఊరు! తన కూతురు ఇంటి పక్కనే ఉంటాది. మొన్న సచివాలయం పరీక్షల్లో ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది. పోస్టింగ్ నేను జాబ్ చేస్తున్న పక్క ఊరే. నన్ను దాటుకుని రోజు వెళుతుంది. తనను చూస్తుంటే కంట్లో నీళ్లు వస్తున్నాయి.
- రాజు, విజయనగరం
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment