
ప్రతీకాత్మక చిత్రం
చిన్నప్పటినుంచి నాకు నా మరదలంటే చాలా ఇష్టం. తను విజయవాడలోని భిషిప్ అజారయ్య హాస్టల్లో 1 నుండి 10వ తరగతి వరకు చదివింది. తన ప్రతి పుట్టిన రోజుని నేను గ్రాండ్‌గా చేస్తాను. తనంటే నాకు చెప్పలేని ప్రేమ. తనకు కూడా నేనంటే ఇష్టమే. ఫోన్ చేసినప్పుడు భార్యాభర్తలుగా పిలుచుకుంటూ మాట్లాడుకునేవాళ్లం. ఆ తర్వాత తన టెన్త్ పూర్తయింది. పాలిటెక్నిక్ రాసి నరసరావుపేటలోని సాయి తిరుమల కాలేజ్‌లో జాయిన్ అయ్యింది. అలా మా జీవితం సాఫీగా సాగిపోయేది. హఠాత్తుగా ఓ రోజు నాకు కాల్ చేసి ‘నేను మా కాలేజ్‌లో ఓ అబ్బాయిని ప్రేమించాను. తనేనే పెళ్లి చేసుకుంటాను’ అంది. ఆ మాటతో నేను స్టన్ అయిపోయాను.
ఆ అమ్మాయి అలా అనగానే నాకు చాలా బాధేసింది. తనని తన ఫ్రెండ్ చెడగొట్టింది అని తెలుసుకున్నా. తనని చాలా బతిమలాడాను. తను వినలేదు నేను డిప్రెషనన్‌లోకి వెళ్లాను. తన మోసాన్ని భరించలేకపోయాను! ఫోన్ చేసి తిట్టాను. అయినా నాకు వాడే కావాలని పట్టుదలతో ఉంది. మా ఇంట్లో ఈ విషయం తెలిసి నన్ను తిట్టారు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. తను చేసిన మోసాన్ని లైఫ్‌లాంగ్ గుర్తుంచుకుంటాను.
- సుబ్బు
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment