‘రైతు ప్రభుత్వం అంటూనే మోసం చేస్తున్నారు.. వారి పొట్టగొట్టేందుకు ముఖ్యమంత్రి జీఓ 123 తీసుకొచ్చిండ్రు.. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఎక్కడా మాట్లాడటంలేదు.. కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు.. మల్లన్నసాగర్, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల లక్ష్యాన్ని నీరుగార్చే విధంగా వ్యవహరిస్తున్నరు.. న్యాయస్థానాల ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు’ అంటూ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ రైతుపోరు సభలో ఆయన ప్రసంగించారు.
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని, ప్రాజెక్టుల నిర్మాణానికి రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తుందని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ రైతుపోరు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు అతితక్కువ నష్టపరిహారం చెల్లిస్తూ.. ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. జీఓ నెం. 123 ప్రకారం భూములు తీసుకుంటూ రైతులను ముంచుతున్నారని మండిపడ్డారు. మల్లన్నసాగర్, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు పథకాల లక్ష్యాన్ని నీరుగార్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేస్తూ, రైతు సంక్షేమాన్ని విస్మరిస్తుందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.791కోట్లు విడుదల చేస్తే నిధులు పక్కదారి పట్టించి రైతుల నోట్లో మట్టికొట్టారని మండిపడ్డారు. నిధుల ఖర్చుపై కౌన్సిల్‌లో తాను ప్రశ్నించినా.. సమాధానం చెప్పకుండా దాటవేస్తుందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ తీసుకొస్తున్న సంస్కరణల్లో భాగంగానే రాష్ట్రంలో 24గంటల కరెంటు వచ్చిందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. జిల్లాలో పత్తి రైతులు, ఇతర పంటలను సాగు చేసిన రైతులు దళారుల బారినపడి మోసపోతుంటే కళ్లప్పగించి చూడటం తప్పా.. గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవడంలేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు రైతులు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రంలో బీజేపీ రావడం ఖాయమన్నారు. సమావేశంలో రాష్ట్ర సంపర్క్ అభియాన్ చైర్మన్ కొండయ్య, బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ ప్రేమ్‌రాజ్‌యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నింగిరెడ్డి, రతంగ్‌పాండురెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల్‌రాజ్, రాజేందర్‌రెడ్డి, ఎగ్గని, సుదర్శన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాలమూరుపై చిత్తశుద్ధిలేదు
వెనుకబడిన పాలమూరు జిల్లాపై ప్ర భుత్వానికి, పాలకులకు ఏమాత్రం చిత్త శుద్ధిలేదని బీజేపీ జి ల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి ఆరోపిం చారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చారని ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తో కాంట్రాక్టర్లు, ప్రభుత్వంలోని పెద్దలు దోచుకుంటున్నారు తప్ప పాలమూరుకు సాగు, తాగునీరు ఇచ్చేందుకు చిత్తశుద్ధి కనిపించడంలేదని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment