ముంబై: దేశంలో అత్యధిక కేసులతో కరోనా కోరల్లో చిక్కుకున్న మహారాష్ట్రలో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేయనున్నారనే వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్నట్టు లాక్‌డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ట్విటర్‌లో స్పష్టం చేశారు. అలాంటి వార్తల్ని ప్రజలు నమొద్దన్ని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు లేకుండానే ఇష్టారీతిన వార్తలు ప్రచారం చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించొద్దని మీడియా సంస్థలకు హితవు పలికారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకే లాక్‌డౌన్ సడలింపులు తెచ్చినట్టు గుర్తు చేశారు.
(చదవండి: ‘కరోనా మృతదేహాలు.. వీడియో వాస్తవం కాదు’)
అయితే, ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభానికి సడలింపులు ఇచ్చామేగానీ.. ప్రజలంతా తప్పక కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. కాగా, మే 31న కేంద్రం అన్‌లాక్-1 నిర్ణయాన్ని ప్రకటించినప్పటికీ.. మహారాష్ట్ర ప్రభుత్వం జూన్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ‘మిషన్ బిగిన్ అగేన్’ పేరుతో ఆర్థిక పరిపుష్టికి అవసరమైన సడలింపులు ప్రకటించారు. మాల్స్ మినహా అన్ని రకాల మార్కెట్లు, షాపుల ప్రారంభానికి అనుమతులు ఇచ్చారు. ఇదిలాఉండగా.. ప్రజలు కోవిడ్ నియంత్రణలను పాటించని పక్షంలో తిరిగి లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందని సీఎం ఉద్ధవ్ ఠాక్రే గురువారం హెచ్చరించడం గమనార్హం.
(చదవండి: ‘మరోసారి లాక్‌డౌన్ తప్పదు’)
Comments
Please login to add a commentAdd a comment