![Aamir Khan in a Hollywood film remake after 'Thugs of Hindostan'? - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/19/aamirkhan.jpg.webp?itok=pFSBmhtX)
ఆమిర్ ఖాన్
ఆమిర్ ఖాన్ ప్లాన్ మారిందని బాలీవుడ్ టాక్. ఏంటా ప్లాన్ అంటే? ఆధ్యాత్మిక గురువు ఓషో జీవితం ఆధారంగా చేయాలనుకున్న సినిమాని ఆయన పక్కన పెట్టారట. ఎందుకంటే కథ ఆమిర్ అనుకున్న విధంగా లేదని సమాచారం. కథలో తనకు కావాల్సిన మార్పులు చెప్పి, మరో వెర్షన్ రెడీ చేయమని చిత్రదర్శకుడు శకున్ బాత్రాకి చెప్పారట ఆమిర్. అన్ని మార్పులు చేసినా సరిగ్గా కుదరదనే అభిప్రాయం కూడా ఆమిర్‌కి ఉందని, అందుకే ఈ ప్రాజెక్ట్ చేయకూడదనుకుంటున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పుడు ఆమిర్ ఆసక్తి అంతా ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ పైన ఉందట.
ఆ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నారని భోగట్టా. ఇంతకీ ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌కి అంతగా నచ్చిన ఆ హాలీవుడ్ సినిమా ఏంటి? అని సన్నిహితులు అడిగినా పెదవి విప్పడంలేదట. అయితే.. పారామౌంట్ పిక్చర్స్ నిర్మించిన ఓ హిట్ సినిమా అనే విషయం మాత్రం బయటికొచ్చింది. సో.. పారామౌంట్ సంస్థ తీసిన సినిమాల లిస్ట్ బయటికి తీయండి. అందులో ఆమిర్ ఏ చిత్రాన్ని సెలెక్ట్ చేసుకుని ఉంటారో ఊహించండి. మీరు బాగా ఖాళీగా ఉంటేనే సుమా. లేకపోతే ఎలానూ అధికారికంగా ప్రకటించాలనుకున్నప్పుడు ఆమిర్ స్వయంగా చెబుతారు కదా. అప్పటిదాకా వెయిట్ చేయడమే.
Comments
Please login to add a commentAdd a comment