మెగాస్టార్‌తో మిస్టర్‌ పర్ఫెక్ట్‌ | Aamir Khan Says Megastar Chiranjeevi is An Inspiration | Sakshi
Sakshi News home page

మెగాస్టార్‌తో మిస్టర్‌ పర్ఫెక్ట్‌

Published Sun, Apr 7 2019 10:01 AM | Last Updated on Sun, Apr 7 2019 10:02 AM

Aamir Khan Says Megastar Chiranjeevi is An Inspiration - Sakshi

సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి షెడ్యూల్‌కు చిన్న బ్రేక్‌ రావటంతో భార్య సురేఖతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ప్రస్తుతం జపాన్‌లో ఉన్న మెగాస్టార్‌ను బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్ కలిశారు. చిరుతో కలిసి దిగిన ఫోటోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్‌ చేసిన ఆమిర్‌ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.

నా అభిమాన నటుడు, సూపర్‌ స్టార్‌ చిరంజీవి గారిని క్యోటో ఎయిర్‌పోర్ట్‌లో కలిశాను. ఎంతో ఆనందంగా ఉంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ  ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా గురించి ఆయనతో చర్చించాను. మీరు మాకు ఇన్సిపిరేషన్‌ సార్’ అంటూ ట్వీట్ చేశాడు ఆమిర్‌. థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌ ఫెయిల్యూర్‌ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న ఆమిర్‌ ఖాన్‌ ప్రస్తుతం భారీగా ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న మహాభారత్‌ ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement