పాత్ర ఎలా డిమాండ్ చేస్తే అలా మారిపోతుంటాడు బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. 57 ఏళ్ల వయసులో ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లాల్‌సింగ్ చద్దా. ఇందులో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటించాడు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖుల కోసం ఓ ప్రత్యేక షో వేశాడు ఆమిర్. ఏకంగా చిరంజీవి ఇంట్లోనే లాల్‌సింగ్ చద్దా ప్రీమియర్ వేశాడు. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సుకుమార్, నాగచైతన్య.. ఆమిర్‌తో కలిసి సినిమా వీక్షించారు. అనంతరం దీనికి సంబంధించిన ఓ వీడియోను మెగాస్టార్ ట్విటర్‌లో షేర్ చేశాడు. 'కొన్ని సంవత్సరాల క్రితం నా ప్రియమైన స్నేహితుడు అమీర్‌ఖాన్‌ను జపాప్‌లోని క్యోటో విమానాశ్రయంలో కలిశాను. అప్పుడు జరిగిన ఒక మీటింగ్, చిన్న చాట్ ఎంతో మనోహరమైనది. నా ఇంట్లో లాల్ సింగ్ చద్దా ప్రత్యేక ప్రివ్యూ ఇచ్చినందుకు ఆమిర్‌ఖాన్‌కి ధన్యవాదాలు. అద్భుతమైన సినిమా తీశావు. లాల్ సింగ్ చద్దా తెలుగు వెర్షన్‌ను ప్రదర్శించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనను మన తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు' అని రాసుకొచ్చాడు.
చదవండి: రెమ్యునరేషన్ లెక్కలు బయటపెట్టిన కీర్తి
బాలీవుడ్ స్టార్‌లను విమర్శించిన డైరెక్టర్‌పై నెటిజన్ల ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment