కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై అభిషేక్‌ ట్వీట్‌ | Abhishek Bachchan Tweet On Family Members Health | Sakshi
Sakshi News home page

కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై అభిషేక్‌ ట్వీట్‌

Jul 12 2020 7:29 PM | Updated on Jul 13 2020 7:54 AM

Abhishek Bachchan Tweet On Family Members Health - Sakshi

ముంబై :  బాలీవుడ్‌ బాద్‌షా అమితాబ్‌ బచ్చన్‌ ఇంట్లో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. శనివారం అమితాబ్‌, ఆయన తనయుడు అభిషేక్‌లకు కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా, నేడు ఆయన కోడలు ఐశ్వర్యరాయ్‌, మనవరాలు ఆరాధ్యకు పాజిటివ్‌గా తేలింది. మరోవైపు బిగ్‌బీ సతీమణి జయబచ్చన్‌కు మాత్రమే కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం అమితాబ్‌, అభిషేక్‌ల ఆరోగ్యం నిలకడగానే ఉందని నానావతి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితిపై అభిషేక్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. (ఐశ్వర్య రాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్)

‘ఐశ్వర్య, ఆరాధ్యలకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. వారిద్దరు ప్రస్తుతం ఇంట్లోనే సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. బీఎంసీ వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తుంది. నా తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యులకు కరోనా నెగిటివ్‌గా తేలింది. మీ అందరి ప్రార్థనలకు ధన్యవాదాలు. వైద్యులు నిర్ణయం తీసుకునేవరకు నేను, నా తండ్రి ఆస్పత్రిలోనే ఉంటాం. దయచేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా, క్షేమంగా ఉండండి. అన్ని నియమాలు పాటించండి’ అని అభిషేక్‌ కోరారు. (నటుడి కుటుంబంలో నలుగురికి కరోనా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement