అతి కష్టంతోనే అవకాశాలు : నటి | Actress Aditi Rao Talk About Mani Ratnam | Sakshi
Sakshi News home page

అతి కష్టంతోనే అవకాశాలు : నటి

Published Sat, Apr 21 2018 5:24 PM | Last Updated on Wed, Apr 3 2019 9:04 PM

Actress Aditi Rao Talk About Mani Ratnam - Sakshi

సాక్షి, సినిమా : నటి అదితిరావ్ నేను చాలా కష్టపడే అవకాశాలు పొందాను అంటోంది‌. ఈ బాలీవుడ్‌ బ్యూటీ మణిరత్నం చిత్రం కాట్రువెలియిడై చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన విషయం తెలిసిందే. అందులో నటుడు కార్తీతో రొమాన్స్‌ సన్నివేశాల్లో చాలా సన్నిహితంగా నటించి గుర్తింపు పొందింది.  అదితిరావ్‌ ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న పద్మావత్‌ చిత్రంలోనూ కీలక పాత్రను పోషించారు. కాగా తాజాగా మణిరత్రం అదితికి మరో అవకాశం ఇచ్చారు. ఆయన తాజా చిత్రం సెక్క సివంద వానం చిత్రంలో అరవిందస్వామి, శింబులతో కలిసి నటిస్తోంది. ఇందులో నటి జ్యోతిక, ఐశ్వర్య రాజేశ్‌ కూడా ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. 

ఈ సందర్భంగా అదితిరావ్‌ తన భావాలను పంచుకుంది. అవేమిటో చూద్దాం.. ‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మణిరత్నం అభిమానిని. బొంబాయి చిత్రం చూసి అందులో నటించిన మనీషాకొయిరాల మాదిరి అవ్వాలని కలలు కన్నాను. అలాంటి తరుణంలో మణిరత్నం చిత్రంలో నటించే అవకాశం రావడంతో పట్టరాని సంతోషం కలిగింది. మణిరత్నం కిందకు దూకమన్నా ఆలోచించకుండా దూకేస్తాను’ అని అదితిరావ్‌ పేర్కొన్నారు. 

అదేవిధంగా విభిన్న కథా చిత్రాల్లో వైవిధ్యభరిత పాత్రలు పోషించాలని ఆశపడుతున్నాను. సినీ కుటుంబాల నుంచి వచ్చిన వారికి అవకాశాలు రావడం సులభం. అలాంటి నేపధ్యం లేనివారు ఈ రంగంలో ఎదగడం కష్టతరమే. నేను ఎలాంటి సినీ నేపధ్యం లేకుండా వచ్చిన వారిలో ఒకరినే. నటిగా సపోర్టు చేయడానికి ఎవరూ లేరు. చాలా కష్ట పడే అవకాశాలు అందుకున్నాను. నిజం చెప్పాలంటే నాకు టర్నింగ్‌ ఇచ్చే కథా పాత్ర ఇంకా దొరకలేదు. అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నానని నటి అదితిరావ్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement