బాహుబలి 2లోనూ కనిపిస్తాడట..! | Adivi Sesh in Baahubali 2 | Sakshi
Sakshi News home page

బాహుబలి 2లోనూ కనిపిస్తాడట..!

May 15 2016 11:45 AM | Updated on Jul 14 2019 4:05 PM

బాహుబలి 2లోనూ కనిపిస్తాడట..! - Sakshi

బాహుబలి 2లోనూ కనిపిస్తాడట..!

తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన భారీ చిత్రం బాహుబలి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో చిన్న పాత్ర అయినా చేస్తామంటూ స్టార్ హీరోలు కూడా ఓపెన్గా స్టేట్ మెంట్లు...

తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన భారీ చిత్రం బాహుబలి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో చిన్న పాత్ర అయినా చేస్తామంటూ స్టార్ హీరోలు కూడా ఓపెన్గా స్టేట్ మెంట్లు ఇచ్చారు. అంతటి ప్రతిష్టాత్మక చిత్రంలో కీలక పాత్రలో నటించాడు యువ నటుడు అడవి శేష్. అయితే రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తొలి భాగం ఇంటర్వెల్లోనే చనిపోయే చిన్న పాత్రలో మాత్రమే కనిపించాడు.

తొలి భాగంలో అడవి శేష్ నటించిన భద్ర పాత్ర చనిపోవటంతో ఇక రెండో భాగంలో అతని క్యారెక్టర్ ఉండదని భావించారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ భద్ర పాత్రను సీక్వల్లోనూ కంటిన్యూ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే క్యారెక్టర్గా కనిపించకపోయినా, బాహుబలి చేతిలో నరకబడ్డ భద్ర తల బాహుబలి 2లో కీలక సన్నివేశాలల్లో కనిపించనుందట.

ఈ సీన్స్ కోసం అడవి శేష్ తలను పోలిన బొమ్మను నిపుణులతో తయారు చేయిస్తున్నారు. నిజమైన తలలా కనిపించటం కోసం మేకప్ కోసం వినియోగించే ప్రొస్థటిక్ మెటీరియల్తో ఈ తలను తయారు చేస్తున్నారట. ఈ పని మీదే అడవి శేష్ ఇటీవల డెన్మార్క్ కూడా వెల్లొచ్చాడన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయాన్నైనా బాహుబలి యూనిట్ కన్ఫామ్ చేస్తుందో లేక మరోసారి గాసిప్ అంటూ కొట్టి పారేస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement