
అఖిల్
అఖిల్ హీరోగా ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా లండన్ షెడ్యూల్ పూర్తయింది. ‘‘దాదాపు 50 రోజుల క్రితం లండన్‌లో మొదలైన మా సినిమా షెడ్యూల్ ముగిసింది.
లండన్‌కు గుడ్ బై చెప్పాల్సిన టైమ్ వచ్చింది. మంచి అనుభవాలను ఫేస్ చేశాను’’ అని అఖిల్ పేర్కొన్నారు. ‘‘కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను. కొత్త ఆశలతో లండన్‌కి గుడ్ బై చెబుతున్నాను’’ అన్నారు ని«ధి. లండన్ షెడ్యూల్‌లో ఓ పాటను కూడా కంప్లీట్ చేశారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్. ఈ సినిమాకు తమన్ స్వరకర్త.
Comments
Please login to add a commentAdd a comment