'సైజ్ జీరో' లో నాగార్జున | Akkineni Nagarjuna to do a cameo in 'Size Zero' | Sakshi
Sakshi News home page

'సైజ్ జీరో' లో నాగార్జున

Published Thu, May 14 2015 2:24 PM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

'సైజ్ జీరో' లో నాగార్జున - Sakshi

'సైజ్ జీరో' లో నాగార్జున

'సోగ్గాడే చిన్ని నాయన' షూటింగ్ బిజీగా ఉన్న అక్కినేని నాగార్జున 'సైజ్ జీరో' లో మెరవనున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'సైజ్ జీరో' సినిమాలో  కీలకపాత్రలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమా నాగార్జున పాత్ర ప్లస్ అవుతుందని చిత్రవర్గాలు వెల్లడించాయి. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తైందని తెలిపాయి. తమిళ వెర్షన్ లో మరొకరు నటించే అవకాశముంది.

లావుగా ఉన్న అమ్మాయి ఓ యువకుడితో ప్రేమలో పడే కథ ఇది. బాహ్య సౌందర్యం కంటే, అంతఃసౌందర్యం ముఖ్యమనేది ఈ చిత్ర కథాంశం. వినోదంతో పాటు మంచి సందేశం ఉన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో పొట్లూరి వి. ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement