ఆలస్యంగా పెళ్లి.. తిరుగులేని క్రమశిక్షణ | akkineni nageswararao maintained good discipline | Sakshi
Sakshi News home page

ఆలస్యంగా పెళ్లి.. తిరుగులేని క్రమశిక్షణ

Published Wed, Jan 22 2014 8:46 AM | Last Updated on Thu, May 24 2018 12:20 PM

ఆలస్యంగా పెళ్లి.. తిరుగులేని క్రమశిక్షణ - Sakshi

ఆలస్యంగా పెళ్లి.. తిరుగులేని క్రమశిక్షణ

నాగేశ్వరరావుకు ఆలస్యంగా పెళ్లయింది. సినీ పరిశ్రమకు చెందినవారు కావడంతో ఆయనకు పిల్లను ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ఆయన అన్నపూర్ణను పెళ్లి చేసుకున్నారు. అది కూడా చాలా ఆలస్యం అయ్యింది. దాంతో ఆయన ప్రతి విషయంలోనూ చాలా కచ్చితంగా ఉండేవారు. ముఖ్యంగా ఏ హీరోయిన్తోనూ ఆయనకు సంబంధలున్నట్లు కనీసం రూమర్లు కూడా రాలేదని స్వయంగా ఆయన కుమారుడు నాగార్జున ఓ సందర్భంలో చెప్పారు. క్రమశిక్షణకు ఆయన మారుపేరని, ఆయనకున్నంత క్రమశిక్షణ తనకు మాత్రం లేదని అన్నారు.

అక్కినేని నాగేశ్వరరావు 1974 అక్టోబర్ 18వ తేదీన ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. అలాంటి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా అత్యంత ఆరోగ్యంగా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నటన కొనసాగించారంటే అది కేవలం ఆయనొక్కరికే సాధ్యం. తిరుగులేని క్రమశిక్షణే అందుకు కారణమని ఆయనంటే ఏంటో తెలిసినవాళ్లందరూ చెబుతుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement