late marriage
-
30లో ప్రెగ్నెన్సీ ప్లాన్,బీపీ, షుగర్ రిస్క్.. మరి పెళ్లికి సరైన వయసేది?
మా అమ్మాయికి 22 ఏళ్లు. ఇంజినీరింగ్ అయిపోయి ఈమధ్యనే ఉద్యోగంలో చేరింది. పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. కానీ తను ఇంకో అయిదేళ్ల దాకా పెళ్లి ప్రసక్తి తేవద్దంటోంది. పిల్ల మొండితనం వల్ల పెళ్లికి మరీ ఆలస్యం అవుతుందేమోనని చింతగా ఉంది. ఆడపిల్ల పెళ్లికి సరైన వయసేదో సూచించగలరా? – చల్లపల్లి వింధ్యాకిరణ్, హోస్పేట్ ఈరోజుల్లో ఉన్నత చదువుల కోసం ప్రతి ఆడపిల్లా ప్రయత్నిస్తోంది. దాంతో వ్యక్తిగత శ్రద్ధ, బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండట్లేదు. దీనివల్ల పెళ్లి, పిల్లలు అన్నీ ఆలస్యం అవుతున్నాయి. ఈ క్రమంలో చాలాసార్లు 35 ఏళ్లు దాటిన తరువాత ప్రెగ్నెన్సీస్‌ని చూస్తున్నాం. అలాగని ఎర్లీ మ్యారెజెస్ ఏమీ విజయవంతం కావడంలేదు. వాటిల్లో విడాకులనూ చూస్తున్నాం. అందుకని పెళ్లికి సరైన వయసు ఇదని చెప్పడం కష్టమే మరి! ఈ రెండు పారామీటర్స్‌ని దృష్టిలో పెట్టుకుని 28 –32 ఏళ్ల మధ్య వయసు పెళ్లికి బెస్ట్ వయసుగా కొన్ని రీసెర్చ్ పేపర్స్ చెబుతున్నాయి. ఈ వయసుకి ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ మెంటల్ ఎబిలిటీ వస్తుంది. ఈ వయసులో ట్రామా, స్ట్రెస్, ఎమోషనల్, ఫిజికల్, మెంటల్ బ్యాలెన్స్, కమ్యూనికేషన్ చక్కగా ఉంటాయి. మనం ఏం చేయాలి?మనకేం కావాలి? అనే విషయాల్లో స్పష్టంగా ఉంటారు. అమ్మాయికి 30 ఏళ్లు దాటినప్పటి నుంచి నేచురల్ లేదా స్పాంటేనియస్ ప్రెగ్నెన్సీ చాన్సెస్ తగ్గుతుంటాయి. జీవనశైలిలో మార్పుల వల్ల చాలామంది అమ్మాయిల్లో అండాల నాణ్యతా తగ్గిపోతోంది. ఏఎమ్‌హెచ్ అనే టెస్ట్‌తో దీన్ని కనిపెట్టవచ్చు. 30 –35 ఏళ్లలో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బీపీ, సుగర్ వచ్చే చాన్సెస్ పెరుగుతాయి. లేట్ మ్యారేజెస్ .. ఇండైరెక్ట్‌గా లేట్ ప్రెగ్నెన్సీస్ వల్ల మెడికల్ కాంప్లికేషన్స్ పెరుగుతాయి. కాబట్టి 28 – 30 ఏళ్ల మధ్యలో పెళ్లిని ప్లాన్ చేసుకుంటే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. అలాగే భవిష్యత్‌లో ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కూడా తక్కువగా ఉంటాయి. డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
లేటు వయసులో ఓ తండ్రి ఘనకార్యం
సాక్షి, బెంగళూరు : లేటు వయసులో వారసుడు కావాలంటూ యువతిని పెళ్లాడి, భార్యా బిడ్డలను బజారు పాలుచేసిన ఓ ఘరానా వ్యక్తి ఉదంతమిది. బెళగావి తాలూకా కాకతి గ్రామానికి చెందిన బాళెగౌడ పాటిల్ (55) ఈ ఘనకార్యానికి పాల్పడ్డాడు. ఇతనికి 25 ఏళ్ల క్రితం అక్క మహదేవి అనే మహిళతో వివాహమైంది. వీరికీ ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. అయితే కొడుకు చిన్న వయస్సులోనే మరణించాడు. పెద్దమ్మాయికి ఇటీవలే పెళ్లి చేసి అత్తవారింటికి పంపారు. ఇంకా ఇద్దరు అమ్మాయిలు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. ఇంతలో బాళెగౌడకు ఏం బుద్ధి పుట్టిందోగానీ తనకు వారసుడు కావాలంటూ ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాకుండా భార్య, కుమార్తెలను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. సొంతూర్లో అయితే బాగుండదని బెళగావికి కొత్త కాపురం మార్చేశాడు. కాగా అక్క మహాదేవి నర్సుగా పనిచేస్తూ ఇద్దరు కూతుళ్లనూ చదివిస్తోంది. హాస్టల్లో చదువుతున్న ఇద్దరు అమ్మాయిల ఫీజులను కట్టడం తనకు కష్టంగా ఉన్నట్లు ఆమె వాపోతోంది. ఈ క్రమంలో ఇద్దరు కూతుళ్లు తండ్రిని వెతుక్కుంటూ బుధవారం ఇంటికి రాగా తాళం కనిపించింది. తమకు న్యాయం చేయాలని కాకతి పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అమ్మాయిలకు మద్దతిచ్చారు. పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లలను వీధిపాలు చేసిన తండ్రికి తగిన గుణపాఠం చెప్పాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
అక్కడ పెళ్లికాని ప్రసాదులు లక్షల్లో..
గుజరాత్లో పెళ్లికాని ప్రసాదుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆ రాష్ట్రంలో ముఖ్యంగా సౌరాష్ట్ర ప్రాంతంలో గ్రామీణులను, వ్యవసాయదారులను పెళ్లి చేసుకోవడానికి మహిళలు నిరాకరిస్తున్నారు. గుజరాత్లో 25-34 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారిలో ప్రతి ఇద్దరు అవివాహితులకు, ఏడుగురు పెళ్లికాని యువకులు ఉన్నారు. 25 ఏళ్లకు పైబడిన వారిలో మొత్తం 17.75 లక్షల మంది పెళ్లికాని యువతీయువకులు ఉన్నారు. మగపిల్లలతో పోలిస్తే బాలికల సంఖ్య తగ్గిపోతుండటమే ఈ సమస్యకు కారణం. 1981లో ప్రతి 1000 మంది బాలురుకు 947 మంది బాలికలు ఉండేవారు. అదే 2011 నాటికి బాలికల నిష్పత్తి 886కి తగ్గింది. ఇక గుజరాత్లో పోర్బందర్ ప్రాంతంలోనే పెళ్లికాని యువకుల సంఖ్య ఎక్కువగా ఉంది. చాలా కులాల్లో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ఉన్నత విద్యావంతులుకావడంతో, చదువులేని యువకులను పెళ్లిచేసుకునేందుకు నిరాకరిస్తున్నారు. గత దశాబ్దకాలంలో లేట్ మ్యారేజీలు ఎక్కువగా జరుగుతున్నాయి. పోరబందర్ ప్రాంతానికి చెందిన రమేష్ పటేల్‌కు 34 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లికాలేదు. ఓ పెళ్లి సంబంధం చూస్తే పోర్బందర్కు మారాలని పెళ్లికూతురు తరఫువారు షరతు పెట్టారని, తాను తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకుని కావడంతో వ్యవసాయంతో పాటు తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత తనపై ఉందని, ఊరు విడిచి వెళ్లేందుకు నిరాకరించడంతో తనను వివాహం చేసుకునేందుకు ఆ అమ్మాయి నిరాకరించిందని రమేష్ చెప్పాడు. గుజరాత్లో రమేష్ లాంటి పెళ్లికాని యువకులు లక్షలాదిమంది ఉన్నారు. -
దాని వల్ల పెళ్లికి ప్రాబ్లమా?
సందేహం నా వయసు 23. నాకు పీరియడ్స్ టైమ్‌లో బాగా కడుపునొప్పి ఉంటుంది. దానికి కారణమేంటో మీ శీర్షిక ద్వారా తెలుసుకున్నాను. కానీ నాకు రెండు రోజులకు మించి బ్లీడింగ్ అవ్వదు. అప్పుడు కూడా అంతంత మాత్రమే. మా ఫ్రెండ్స్కేమో అయిదు రోజులు అవుతుందట. దానివల్ల నాకు పిల్లలు పుట్టడానికి ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా? ఈ మధ్య చాలా భయంగా ఉంటోంది. ఎందుకంటే, మా ఇంట్లో వాళ్లు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కాబట్టి నా అనుమానానికి సమాధానం చెప్పండి ప్లీజ్. - రాధిక, వరంగల్ ఆడవారిలో ఊఏ, ఔఏ, ప్రొలాక్టిన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, థైరాయిడ్ వంటి అనేక రకాల హార్మోన్లు సక్రమంగా విడుదలవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి శరీరతత్వాన్ని బట్టి మూడురోజుల నుంచి ఏడు రోజుల వరకు దాదాపు 50ఝ నుంచి 80ఝ వరకు బ్లీడింగ్ అవుతుంది. కొందరిలో అధిక బరువు, పాలిసిస్టిక్ ఓవరీస్, థైరాయిడ్ సమస్య, మానసిక ఒత్తిడి, గర్భాశయం, అండాశయాల సైజు చిన్నగా ఉండటం వంటి ఎన్నో సమస్యల వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి బ్లీడింగ్ కొద్దిగానే అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవే సమస్యలు ఉన్నప్పటికీ... కొందరిలో అధికంగానూ బ్లీడింగ్ అవ్వొచ్చు. హార్మోన్ల అసమతుల్యత వల్ల గర్భాశయంలోని పొర సరిగా పెరగకపోవడం వల్ల కూడా బ్లీడింగ్ కొద్దిగా అవ్వొచ్చు. కొంతమందిలో రెండు రోజులే అయినా, బ్లీడింగ్ బాగా అయ్యి ఆగిపోతుంది. దానివల్ల ఇబ్బంది లేదు. మీరు బరువు ఎంత ఉన్నారో రాయలేదు. బరువు మరీ తక్కువ ఉండడం వల్ల కూడా కొందరిలో బ్లీడింగ్ తక్కువ అవ్వొచ్చు. ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, సమస్య ఎక్కడుందో తెలుసుకోవడానికి ఇఆ్క, హార్మోన్ల పరీక్షలు, స్కానింగ్ వంటివి చేయించుకొని చికిత్స తీసుకోవచ్చు. అధిక బరువు ఉంటే పరిమిత ఆహారం, వ్యాయామాలు చేసి తగ్గడం వల్ల ఉపయోగం ఉంటుంది. పైన చెప్పిన సమస్యలు ఉండడం వల్ల బ్లీడింగ్ కొద్దిగా అవుతుంటే... పెళ్లైన తర్వాత సాధారణంగా గర్భం దాల్చడానికి ఇబ్బంది అవ్వొచ్చు. కాబట్టి ముందుగానే జాగ్రత్తగా సమస్యకు తగ్గ చికిత్స తీసుకుంటే, తర్వాత ఇబ్బంది ఉండకపోవచ్చు. నా వయసు 33. పెళ్లై సంవత్సరం అయింది (లేట్ మ్యారేజ్). మావారు నాకన్నా ఒక్క సంవత్సరం పెద్దవారు. కొన్ని కుటుంబ ఆర్థిక కారణాల వల్ల నాకు పెళ్లి ఆలస్యంగా జరిగింది. నాలుగు నెలల క్రితం పీరియడ్ ఆలస్యంకావడంతో ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను. పాజిటివ్ అని వచ్చింది. దాంతో డాక్టర్ దగ్గరకు వెళ్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అన్నారు. మూడు నెలల వరకు ఆరోగ్యంగానే ఉన్నాను. కానీ ఈ మధ్య కడుపులో బాగా నొప్పిగా ఉంటోంది. తరచూ వేడి చేస్తోంది. దాంతో అబార్షన్ అవుతుందేమోనని భయంగా ఉంది. ముప్ఫై దాటితే ప్రెగ్నెన్సీ కష్టమంటారు. అలాంటిది నేను ఈ వయసుకు ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల లేనిపోని అనుమానాలు కలుగుతున్నాయి. నా నొప్పికి గల కారణాలను చెప్పగలరు. - స్వప్న, ఒంగోలు మీరు డాక్టర్ దగ్గర ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేయించుకున్న తర్వాత నెలనెలా చెకప్‌కు వెళ్లినట్టు లేరు. సాధారణంగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత డాక్టర్ దగ్గర నెలనెలా చెకప్ చేయించుకోవాలి. మొదటి గర్భంలో అనేక కారణాల వల్ల 10-15 శాతం మందిలో అబార్షన్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. అబార్షన్ అయ్యే వారిలో 30 ఏళ్ల వయసు పైబడిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అంతే కానీ తప్పనిసరిగా సమస్యలు ఉంటాయని ఏమీ లేదు. మొదటి రెండు నెలలలో స్కానింగ్ చేయించుకుంటే, గర్భాశయంలో పిండం ఏర్పడిందా లేదా, దానిలో గుండె కొట్టుకోవడం (హార్ట్ బీట్) మొదలైందా లేదా అనే విషయాలు తెలుస్తాయి. తర్వాత మూడో నెల చివరిలో.. అంటే 12 వారాల సమయంలో గర్భంలోని పిండంలో చిన్న చిన్న చేతులు, కాళ్లు, తల, శరీరం ఏర్పడి శిశువు ఆకృతి ఏర్పడుతుంది. ఈ సమయంలో ఎన్టీ స్కాన్ చేయించుకుంటే, శిశువులో కొన్ని శారీరక లోపాలు, జన్యులోపాలు ఉంటే, వాటిని గుర్తించే వీలుంటుంది. మొదటి నాలుగు నెలలలో మూత్రంలో, యోనిలో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని వల్ల కడుపు నొప్పి రావచ్చు. కడుపులో ఎసిడిటీ, అజీర్తి, గ్యాస్ ఏర్పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ వంటి సమస్యలు, అండాశయాలలో పెద్ద పెద్ద సిస్ట్లు పెరగటం వంటి ఎన్నో సమస్యల వల్ల కడుపులో నొప్పి రావచ్చు. మీరు అబార్షన్ అవుతుందేమోనని భయపడుతూ ఇంట్లో కూర్చుంటే ఎలా? మీరు ముందు గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, అవసరమైన రక్త, మూత్ర పరీక్షలు, స్కానింగ్ చేయించుకుంటే.. సమస్య ఏమిటో తెలుసుకొని దానికి తగిన చికిత్సను డాక్టర్లు అందిస్తారు. -
ఆలస్యంగా పెళ్లి.. తిరుగులేని క్రమశిక్షణ
నాగేశ్వరరావుకు ఆలస్యంగా పెళ్లయింది. సినీ పరిశ్రమకు చెందినవారు కావడంతో ఆయనకు పిల్లను ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ఆయన అన్నపూర్ణను పెళ్లి చేసుకున్నారు. అది కూడా చాలా ఆలస్యం అయ్యింది. దాంతో ఆయన ప్రతి విషయంలోనూ చాలా కచ్చితంగా ఉండేవారు. ముఖ్యంగా ఏ హీరోయిన్‌తోనూ ఆయనకు సంబంధలున్నట్లు కనీసం రూమర్లు కూడా రాలేదని స్వయంగా ఆయన కుమారుడు నాగార్జున ఓ సందర్భంలో చెప్పారు. క్రమశిక్షణకు ఆయన మారుపేరని, ఆయనకున్నంత క్రమశిక్షణ తనకు మాత్రం లేదని అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు 1974 అక్టోబర్ 18వ తేదీన ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. అలాంటి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా అత్యంత ఆరోగ్యంగా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నటన కొనసాగించారంటే అది కేవలం ఆయనొక్కరికే సాధ్యం. తిరుగులేని క్రమశిక్షణే అందుకు కారణమని ఆయనంటే ఏంటో తెలిసినవాళ్లందరూ చెబుతుంటారు.