మా అమ్మాయికి 22 ఏళ్లు. ఇంజినీరింగ్ అయిపోయి ఈమధ్యనే ఉద్యోగంలో చేరింది. పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. కానీ తను ఇంకో అయిదేళ్ల దాకా పెళ్లి ప్రసక్తి తేవద్దంటోంది. పిల్ల మొండితనం వల్ల పెళ్లికి మరీ ఆలస్యం అవుతుందేమోనని చింతగా ఉంది. ఆడపిల్ల పెళ్లికి సరైన వయసేదో సూచించగలరా?
– చల్లపల్లి వింధ్యాకిరణ్, హోస్పేట్
ఈరోజుల్లో ఉన్నత చదువుల కోసం ప్రతి ఆడపిల్లా ప్రయత్నిస్తోంది. దాంతో వ్యక్తిగత శ్రద్ధ, బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండట్లేదు. దీనివల్ల పెళ్లి, పిల్లలు అన్నీ ఆలస్యం అవుతున్నాయి. ఈ క్రమంలో చాలాసార్లు 35 ఏళ్లు దాటిన తరువాత ప్రెగ్నెన్సీస్‌ని చూస్తున్నాం. అలాగని ఎర్లీ మ్యారెజెస్ ఏమీ విజయవంతం కావడంలేదు. వాటిల్లో విడాకులనూ చూస్తున్నాం. అందుకని పెళ్లికి సరైన వయసు ఇదని చెప్పడం కష్టమే మరి! ఈ రెండు పారామీటర్స్‌ని దృష్టిలో పెట్టుకుని 28 –32 ఏళ్ల మధ్య వయసు పెళ్లికి బెస్ట్ వయసుగా కొన్ని రీసెర్చ్ పేపర్స్ చెబుతున్నాయి.
ఈ వయసుకి ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ మెంటల్ ఎబిలిటీ వస్తుంది. ఈ వయసులో ట్రామా, స్ట్రెస్, ఎమోషనల్, ఫిజికల్, మెంటల్ బ్యాలెన్స్, కమ్యూనికేషన్ చక్కగా ఉంటాయి. మనం ఏం చేయాలి?మనకేం కావాలి? అనే విషయాల్లో స్పష్టంగా ఉంటారు. అమ్మాయికి 30 ఏళ్లు దాటినప్పటి నుంచి నేచురల్ లేదా స్పాంటేనియస్ ప్రెగ్నెన్సీ చాన్సెస్ తగ్గుతుంటాయి.
జీవనశైలిలో మార్పుల వల్ల చాలామంది అమ్మాయిల్లో అండాల నాణ్యతా తగ్గిపోతోంది. ఏఎమ్‌హెచ్ అనే టెస్ట్‌తో దీన్ని కనిపెట్టవచ్చు. 30 –35 ఏళ్లలో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బీపీ, సుగర్ వచ్చే చాన్సెస్ పెరుగుతాయి. లేట్ మ్యారేజెస్ .. ఇండైరెక్ట్‌గా లేట్ ప్రెగ్నెన్సీస్ వల్ల మెడికల్ కాంప్లికేషన్స్ పెరుగుతాయి. కాబట్టి 28 – 30 ఏళ్ల మధ్యలో పెళ్లిని ప్లాన్ చేసుకుంటే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. అలాగే భవిష్యత్‌లో ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కూడా తక్కువగా ఉంటాయి.
డా‘‘ భావన కాసు,
గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment