ఒకటికి రెండు! | Akshay Kumar to play Gulshan Kumar in biopic ‘Mogul’ | Sakshi
Sakshi News home page

ఒకటికి రెండు!

Published Sun, Mar 19 2017 3:16 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఒకటికి రెండు! - Sakshi

ఒకటికి రెండు!

బాలీవుడ్‌లో బయోపిక్‌ చిత్రాలు కొత్తేమీ కాదు. గత ఏడాది ‘దంగల్‌’, ‘ధోని ది అన్‌ టోల్డ్‌ స్టోరి’, ‘అజహర్‌’, ‘సరబ్‌జిత్‌’... ఇలా దాదాపు ఏడెనిమిది బయోపిక్స్‌ విడుదలయ్యాయి. ఈ ఏడాది కూడా బయోపిక్‌ చిత్రాల హంగామా సాగుతుందనొచ్చు. నటుడు సంజయ్‌ దత్‌ జీవితం ఆధారంగా ఓ సినిమా, రాణి లక్ష్మీబాయ్‌ జీవితకథతో ఓ సినిమా, రాణి పద్మావతి రియల్‌ లైఫ్‌ స్టోరీతో సినిమాలు రానున్నాయి. తాజాగా, అక్షయ్‌కుమార్‌ రెండు నిజజీవిత కథల్లో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం విశేషం. తమిళనాడు పారిశ్రామికవేత్త అరుణాచలం మురుగనందమ్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘ప్యాడ్‌మ్యాన్‌’లో అక్షయ్‌ నటిస్తున్నారు.

 ఆర్‌. బాల్కీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అక్షయ్‌ భార్య, ఒకప్పటి కథానాయిక ట్వింకిల్‌ ఖన్నా నిర్మిస్తున్నారు. నిర్మాతగా ఆమెకిది తొలి సినిమా. ఇందులో సోనమ్‌కపూర్, రాధిక ఆప్టే హీరోయిన్లుగా యాక్ట్‌ చేస్తున్నారు. కాగా, తాజాగా మరో బయోపిక్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.  టీ–సిరీస్‌ అధినేత, నిర్మాత గుల్షన్‌ కుమార్‌ జీవితకథలో నటించనున్నట్టు అక్షయ్‌ వెల్లడించారు. గుల్షన్‌ కుమార్‌ కూతురు తులసీ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను కూడా విడుదల చేశారు.

 ‘మొగల్‌ ది గుల్షన్‌ కుమార్‌ స్టోరి’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి సుభాష్‌ కపూర్‌ దర్శకత్వం వహించనున్నారు. సుభాష్‌ గత ఏడాది  విడుదలైన అక్షయ్‌కుమార్‌ మూవీ ‘జాలీ ఎల్‌.ఎల్‌.బి2’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే..  సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘2.0’ అక్షయ్‌ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా హిందీలో ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథ’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement