ఇప్పట్లో పెళ్లి లేనట్లే! | All is Not Well Between Nayan and Vignesh | Sakshi
Sakshi News home page

ఇప్పట్లో పెళ్లి లేనట్లే!

Published Wed, Jun 28 2017 10:57 PM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM

ఇప్పట్లో పెళ్లి లేనట్లే!

ఇప్పట్లో పెళ్లి లేనట్లే!

నయనతార కంటే వయసులో ఏడాది చిన్నోడయినా... బోలెడంత ప్రేమను నయనకు పంచి, ఆమె ప్రేమను సంపాదించి ఒక్కసారిగా వార్తల్లో పెద్దోడయ్యాడు తమిళ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌. సాయంత్రం వేళకు ఓ గూటికి చేరే పక్షుల వలే... సన్‌ సెట్‌ కాగానే సినిమా సెట్‌ నుంచి విఘ్నేశ్, నయనలు స్ట్రయిట్‌గా ఓ గూటికి చేరి ప్రేమ కబుర్లు చెప్పుకుంటున్నారట. చెన్నై కోడంబాక్కమ్‌ వర్గాలు వీళ్ల ప్రేమకథ గురించి కథలు కథలుగా చెబుతున్నాయి.

 వీళ్లిద్దరూ ఈ కథలకు తగ్గట్టుగా మలయాళీ ఓనమ్, తమిళ పొంగల్‌ ఫెస్టివల్స్‌ను కలిసే సెలబ్రేట్‌ చేసుకున్నారు. ప్రేమలో ఆల్మోస్ట్‌ రెండేళ్లు గడిచాయేమో... మూడో ఏడు వచ్చేసరికి ఏడడుగులు వేసేయాలని విఘ్నేశ్, నయనలు నిశ్చయించుకున్నారని వార్తలొచ్చాయి. అబ్బే... అటువంటిది ఏం లేదని విఘ్నేష్‌ శివన్‌ క్లారిటీ ఇచ్చారు.

 ప్రస్తుతానికి కెరీర్‌ గురించి తప్ప... కల్యాణం గురించి ఆలోచించడం లేదని ఆయన సెలవిచ్చారు. అంతా బాగానే ఉంది.. ‘నయనతారను నేనెందుకు పెళ్లి చేసుకుంటాను?’ అనలేదు కాబట్టి, ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్న మాట నిజమే అన్నమాట. ఏదేమైనా... ఇప్పట్లో నయనతార పెళ్లి లేనట్లే!! ఇంకో మూడు నాలుగేళ్లు కెరీర్‌పై ఫుల్లుగా కాన్సంట్రేట్‌ చేస్తారన్న మాట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement