
వెండితెరపై తన నటనతో ప్రేక్షకుల పెదవులపై ఎన్నో నవ్వులు పూయించారు ‘అల్లరి’ నరేశ్. అవకాశం దొరికినప్పుడల్లా సీరియస్ రోల్స్ కూడా చేశారు. ‘గమ్యం, శంభో శివ శంభో’ తాజాగా ‘మహర్షి’ చిత్రాలే ఇందుకు నిదర్శనం. ఇప్పటివరకు 55 సినిమాలు చేశారు నరేశ్. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అల్లరి’(2002) సినిమాతో ఆయన నటుడిగా పరిచయం అయ్యారని తెలిసిందే. ఈ చిత్రం విడుదలై శుక్రవారంతో 17 ఏళ్లు పూర్తయింది. ఈ విషయంపై ‘అల్లరి’ నరేశ్ స్పందిస్తూ– ‘‘పదిహేడేళ్ల క్రితం ఓ కుర్రాడు జీవితంలో సరైన దారి కోసం వెతుకుతున్నాడు.
ఆ కుర్రాడికి ఇండస్ట్రీలో అవకాశం వచ్చింది. 10మే 2002లో ఆ కుర్రాడు ‘అల్లరి’ నరేశ్‌గా పుట్టాడు. నా ‘అల్లరి’ సినిమా విడుదలై 17ఏళ్లు పూర్తయింది. నా కలలకు ఊపిరి పోసిన వారికి, ‘అల్లరి’ సినిమా బృందానికి రుణపడి ఉంటాను. ఈ విషయాన్ని నేను ఇప్పుడే ఎందుకు చెబుతున్నానంటే.. రవి ఫుల్ సర్కిల్ కంప్లీట్ చేశాడు. నా తొలి సినిమా ‘అల్లరి’లో రవిపాత్ర, ‘మహర్షి’ సినిమాలోనూ రవి పాత్ర చేశాను. నా కెరీర్‌లో చేసిన 55 సినిమాలు నాకు ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చాయి’’అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment